సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

శివ శంకర్‌ మాస్టర్‌ ఆరోగ్యం.. మంచు విష్ణు ట్వీట్‌!

ABN, First Publish Date - 2021-11-26T22:31:34+05:30

ప్రముఖ డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌ శివశంకర్‌ కరోనాతో హైదరాబాద్‌ ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని గురువారం శివశంకర్‌ మాస్టర్‌ కుమారుడు వెల్లడించారు. ఆయన సతీమణి, పెద్దకుమారుడు సైతం కరోనాతో పోరాడుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రముఖ డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్‌ శివశంకర్‌ కరోనాతో హైదరాబాద్‌ ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని గురువారం శివశంకర్‌ మాస్టర్‌ కుమారుడు వెల్లడించారు. ఆయన సతీమణి, పెద్దకుమారుడు సైతం కరోనాతో పోరాడుతున్నారు. కుమారుడు అపస్మారక స్థితిలో ఉండగా.. సతీమణి క్వారంటైన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు. అయితే ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు శివ శంకర్‌ మాస్టర్‌ ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ‘‘శివశంకర్‌ మాస్టర్‌ చికిత్స పొందుతోన్న ఏఐజీ ఆస్పత్రి బృందంతో ఫోన్‌లో మాట్లాడాను. మాస్టర్‌ కోలుకునేందుకు అన్ని విధాలుగా చికిత్స అందిస్తున్నట్లు వైద్యు?ని తెలిపారు. మాస్టర్‌ రెండో కుమారుడు అజయ్‌తోనూ ఫోన్‌లో మాట్లాడాను. ఇప్పుడు ఆయన కుటుంబానికి మన ప్రార్థనలు అవసరం’’ అని విష్ణు ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఆస్పత్రి బిల్లు చెల్లించడంలో మాస్టర్‌ కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్న సోనూసూద్‌, హీరో ధనుష్‌.. తమ వంతు సాయం అందిస్తామని ప్రకటించారు.




Updated Date - 2021-11-26T22:31:34+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!