సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

సందీప్ ఉన్నికృష్ణన్‌కు 'మేజర్' నివాళి..

ABN, First Publish Date - 2021-11-26T17:56:32+05:30

26/11 ముంబై దాడులలో ప్రజల ప్రాణాలను కాపాడడంలో తన ప్రాణాలను కోల్పోయిన అమరవీరుడు సందీప్ ఉన్నికృష్ణన్‌కు 'మేజర్' సినిమా హీరో అడవి శేష్ నివాళులు అర్పించారు. సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా శశి కిరణ్ తిక్క

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

26/11 ముంబై దాడులలో ప్రజల ప్రాణాలను కాపాడడంలో తన ప్రాణాలను కోల్పోయిన అమరవీరుడు సందీప్ ఉన్నికృష్ణన్‌కు 'మేజర్' సినిమా హీరో అడవి శేష్ నివాళులు అర్పించారు. సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో 'మేజర్' చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాలో టైటిల్ రోల్‌ను అడవి శేష్ పోషిస్తుండగా ఆయనకు జంటగా బాలీవుడ్ యంగ్ హీరోయిన్ సాయీ మంజ్రేకర్ నటిస్తోంది. తెలుగమ్మాయి శోభితా ధూళిపాళ, ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. కాగా, ప్రతి సంవత్సరం ఇదేరోజు (నవంబర్ 26) సందీప్ ఉన్నికృష్ణన్ తల్లిదండ్రులు తమ కొడుకు జ్ఞాపకాలను గుర్తు చేసుకునేందుకు తాజ్ మహల్ ప్యాలెస్‌ని సందర్శించడానికి ముంబైకి వెళ్తారు. అలాగే ఈసారి కూడా ముంబై చేరుకున్న వారు ఓ చిన్న సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి హీరో అడవి శేష్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా 'మేజర్' సందీప్ ఉన్నికృష్ణన్‌కు నివాళులు అర్పించారు. 

Updated Date - 2021-11-26T17:56:32+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!