సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

హే రంభ!

ABN, First Publish Date - 2021-08-07T04:31:25+05:30

‘‘కొట్టేయ్‌... జై కొట్టేయ్‌! మనమంతా రంభ ఫ్యాన్సు! కట్టేద్దాం బ్యానర్సు... పెట్టేదాం కటౌట్సు’’ అంటూ శర్వానంద్‌, జగపతిబాబు ఆడి పాడుతున్నారు. అంతే కాదు... పాటలో చెప్పినట్టు రంభ కటౌట్సు కూడా పెట్టారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘‘కొట్టేయ్‌... జై కొట్టేయ్‌! మనమంతా రంభ ఫ్యాన్సు! కట్టేద్దాం బ్యానర్సు... పెట్టేదాం కటౌట్సు’’ అంటూ శర్వానంద్‌, జగపతిబాబు ఆడి పాడుతున్నారు. అంతే కాదు... పాటలో చెప్పినట్టు రంభ కటౌట్సు కూడా పెట్టారు. ఇదంతా సినిమాలో భాగమే! శర్వానంద్‌, సిద్ధార్థ్‌ హీరోలుగా అజయ్‌ భూపతి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘మహాసముద్రం’. సుంకర రామబ్రహ్మం నిర్మాత. ‘రంభ రంభ.. హే రంభ’ పాటను శుక్రవారం విడుదల చేశారు. భాస్కరభట్ల రాసిన ఈ గీతానికి చైతన్‌ భరద్వాజ్‌ బాణీ అందించడంతో పాటు ఆయనే స్వయంగా పాడారు. శర్వానంద్‌, జగపతిబాబుపై తెరకెక్కించిన ఈ గీతానికి జానీ మాస్టర్‌ నృత్య రీతులు సమకూర్చారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘ఇదొక ఇంటెన్స్‌ లవ్‌ అండ్‌ యాక్షన్‌ డ్రామా. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి’’ అని చెప్పారు.

Updated Date - 2021-08-07T04:31:25+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!