‘మగువ మగువ..’ సాంగ్ ఫిమేల్ వెర్షన్‌కు నీరాజనాలు
ABN, First Publish Date - 2021-04-11T03:18:50+05:30
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం 'వకీల్‌సాబ్'. ఏప్రిల్ 9న విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం 'వకీల్‌సాబ్'. ఏప్రిల్ 9న విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్‌తో.. బాక్సాఫీస్‌కు సరికొత్త రికార్డులను పరిచయం చేసే దిశగా ఈ సినిమా రన్ అవుతోంది. కరోనా సెకండ్ వేవ్, ఏపీ ప్రభుత్వ కక్ష సాధింపు ఉన్నా.. 'వకీల్ సాబ్' చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు ఎగబడుతున్నారు. ముఖ్యంగా మహిళలు ఈ సినిమా కోసం ముందుకు వస్తుండటం విశేషం. ఈ సినిమాకు సంబంధించి మొదట విడుదల చేసిన 'మగువ మగువ' సాంగ్ నుంచి.. ఈ చిత్రంపై మహిళలకు మంచి ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఉన్నారు. వారు ఊహించినట్లే.. ఈ సినిమా రూపొందడంతో.. ఈ సినిమాకు ఇప్పుడు మహిళల ఆదరణ లభిస్తోంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించి 'మగువ మగువ' పాట రెండో వెర్షన్‌ను విడుదల చేశారు.
కన్నీళ్లు పెట్టించే సాహిత్యంతో ఉన్న ఈ పాటను రామజోగయ్య శాస్త్రినే రచించారు. ఈ పాట సినిమాలో వస్తుంటే.. ప్రతి ఒక్కరి కళ్లు.. కన్నీళ్లతో చెమర్చుతున్నాయంటే అతిశయోక్తి కానేకాదు. ఈ రెండో వెర్షన్ పాటకు సంబంధించిన సాహిత్యాన్ని.. తాజాగా పాట రచయిత రామజోగయ్య శాస్త్రి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ పాట ఫిమేల్ వెర్షన్‌లో ఉంటుంది. పాటకి సంబంధించిన ఆడియోను కూడా త్వరలోనే విడుదల చేయబోతున్నట్లుగా సంగీత దర్శకుడు థమన్ తెలియజేశారు. ఇక రామజోగయ్య శాస్త్రి పోస్ట్ చేసిన పాట సాహిత్యానికి ప్రతి ఒక్కరూ 'ఏడిపించేశారు గురువు గారు' అంటూ.. కామెంట్స్ చేస్తున్నారు.