సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

‘లవ్ స్టోరీ’ రిలీజ్ డేట్ ఫైనల్ అయ్యేది ఎప్పుడంటే..

ABN, First Publish Date - 2021-08-18T00:01:10+05:30

అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా సెన్సిబుల్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘లవ్ స్టోరీ’. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా సెన్సిబుల్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘లవ్ స్టోరీ’. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కె నారాయణదాస్ నారంగ్, పి.రామ్మోహన్ రావు నిర్మాతలు. షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ఈ చిత్ర విడుదల తేదీని బుధవారం (ఆగస్ట్ 17) నిర్మాతలు ప్రకటించనున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే నెల 10 లేదా 17వ తేదీన విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. రిలీజ్ డేట్‌ను బుధవారం ఫైనల్ చేయనున్నారు. ఈ చిత్రంతో పాటు సోనాలి నారంగ్ స‌మ‌ర్పణ‌లో శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప‌తాకాల‌పై రూపుదిద్దుకుంటోన్న నాగశౌర్య ‘లక్ష్య’ చిత్రాన్ని కూడా సెప్టెంబర్‌లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలిసింది.

Updated Date - 2021-08-18T00:01:10+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!