ఇట్స్ డబ్బింగ్ టైమ్
ABN, First Publish Date - 2021-07-12T06:13:24+05:30
తెలుగు చిత్రాల్లో నటిస్తున్న ఉత్తరాది భామలు ఈమధ్య తమ పాత్రలకు తామే స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారు...
తెలుగు చిత్రాల్లో నటిస్తున్న ఉత్తరాది భామలు ఈమధ్య తమ పాత్రలకు తామే స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. అటువంటి కథానాయికల్లో తమన్నా ఒకరు. ‘ఊపిరి’, ‘ఎఫ్ 2’ చిత్రాలకు డబ్బింగ్ చెప్పారు. ఇప్పుడు ‘మ్యాస్ట్రో’లో తన పాత్రకు డబ్బింగ్ చెబుతున్నారు. నితిన్, నభా నటేశ్ జంటగా నటించిన ఈ సినిమాలో తమన్నా కీలక పాత్రధారి. కథానాయికగా, అతిథిగా కాకుండా... ప్రాముఖ్యం ఉన్న పాత్రలో ఆమె నటిస్తున్న తొలి తెలుగు చిత్రమిదేనని చెప్పాలి. ఓ విధంగా ప్రయోగం చేస్తున్నారు. తమన్నా పాత్రను ఎలా రిసీవ్ చేసుకుంటారో గానీ... ఆమె మాత్రం బాగా కష్టపడుతున్నారు. ‘డబ్బింగ్ టైమ్’ అంటూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ‘మ్యాస్ట్రో’ డబ్బింగ్ స్టూడియోలో తీసుకున్న వీడియో పోస్ట్ చేశారు. దీంతో పాటు గోపీచంద్ సరసన నటిస్తున్న ‘సీటీమార్’లో తన పాత్రకూ తమన్నా డబ్బింగ్ చెప్పుకొంటున్నారని తెలిసింది. అందులో ఆమె తెలంగాణ యాసలో మాట్లాడనున్నారు. ‘మ్యాస్ట్రో’కు వస్తే... త్వరలో మహతీ స్వరసాగర్ సమకూర్చిన పాటలు విడుదల చేయనున్నారు.