కొత్త సంవత్సరం తొలి రోజున..
ABN, First Publish Date - 2021-12-11T04:49:56+05:30
చాలా రోజుల తర్వాత వరుణ్ సందేశ్ హీరోగా మళ్లీ ఎంట్రీ ఇస్తున్న ‘ఇందువదన’ చిత్రం సెన్సార్ పూర్తయింది. ఫర్నాజ్ శెట్టి కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని ఎం.శ్రీనివాసరాజు దర్శకత్వంలో మాధవి....
చాలా రోజుల తర్వాత వరుణ్ సందేశ్ హీరోగా మళ్లీ ఎంట్రీ ఇస్తున్న ‘ఇందువదన’ చిత్రం సెన్సార్ పూర్తయింది. ఫర్నాజ్ శెట్టి కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని ఎం.శ్రీనివాసరాజు దర్శకత్వంలో మాధవి ఆదుర్తి నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘ఇందువదన’ సినిమాను వచ్చే ఏడాది జనవరి ఒకటిన విడుదల చేస్తున్నట్లు నిర్మాత వెల్లడించారు.
‘మా సినిమాలో వరుణ్ సందేశ్, ఫర్నాజ్ లుక్స్ దర్శకుడు శ్రీనివాసరాజు అద్భుతంగా డిజైన్ చేశారు. ఈ సినిమా కోసం వరుణ్ సందేశ్ తననితాను కొత్తగా ఆవిష్కరించుకున్నారు. రాఘవేంద్రరావు విడుదల చేసిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా కూడా అందరినీ అలరిస్తుందని నమ్ముతున్నాం’ అని నిర్మాత మాధవి చెప్పారు.