ఐదు భాషల్లో...
ABN, First Publish Date - 2021-07-22T05:43:16+05:30
రామ్ అగ్నివేశ్, రాజీవ్ కనకాల, ‘కాలకేయ’ ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఇక్షు’. ఐదు భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు...
రామ్ అగ్నివేశ్, రాజీవ్ కనకాల, ‘కాలకేయ’ ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఇక్షు’. ఐదు భాషల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాతలు హనుమంతురావు నాయుడు, డా.గౌతమ్ నాయుడు మాట్లాడుతూ ‘‘ఎన్టీఆర్ జయంతికి విడుదల చేసిన ఫస్ట్‌లుక్, ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభించింది. రామ్ అగ్నివేశ్ అద్భుతంగా నటించాడు. మహిళ అయినప్పటికీ రుషిక చక్కగా చిత్రానికి దర్శకత్వం వహించారు. మా డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది’’ అన్నారు. రుషిక మాట్లాడుతూ ‘‘లేడీ డైరెక్టర్ అని చూడకుండా టీమ్ అంతా ఎంతో మద్దతునిచ్చారు. సినిమా రషెస్ చూసిన కొందరు ప్రశంసిచడంతో మాకు మరింత కాన్ఫిడెన్స్ వచ్చింది’’ అన్నారు. ‘చిత్రం’ శీను, ‘చమ్మక్’ చంద్ర, ‘రచ్చ’ రవి తదితరులు నటించిన ఈ చిత్రానికి మూలకథ: సిద్ధం మనోహర్, పాటలు: కాసర్ల శ్యామ్, సంగీతం: వికాస్ బాడిస.