సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

రాజా గారు వేటకొస్తే...

ABN, First Publish Date - 2021-09-22T06:25:16+05:30

‘‘రాజా గారు బయటకొస్తే... ప్రమాదమే ప్రయాసతో పరారు అంతే! రాజా గారు వేటకొస్తే... భుజాలపై షికారులే ఖరారు అంతే! అదిరెలే... ఇంచైనా తగ్గదింక ఠీవి నీదే! అదిరెలే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘‘రాజా గారు బయటకొస్తే... ప్రమాదమే ప్రయాసతో పరారు అంతే! రాజా గారు వేటకొస్తే... భుజాలపై షికారులే ఖరారు అంతే! అదిరెలే... ఇంచైనా తగ్గదింక ఠీవి నీదే! అదిరెలే... కంగారు మచ్చుకైనా లేనే లేదే’’ అంటూ డేవిడ్‌ సైమన్‌ ఓ పాట పాడారు. ప్రశాంత్‌ ఆర్‌. విహారి సంగీతంలో కేకే రాసిన ఈ గీతం ‘రాజా విక్రమార్క’లోనిది! కార్తికేయ గుమ్మకొండ హీరోగా శ్రీ సరిపల్లి దర్శకత్వంలో ‘88’ రామారెడ్డి నిర్మిస్తున్న చిత్రమిది. సినిమా థీమ్‌ సాంగ్‌ను మంగళవారం విడుదల చేశారు. ‘88’ రామారెడ్డి మాట్లాడుతూ ‘‘ద్వితీయార్థంలో కీలక సందర్భంలో వచ్చే గీతమిది. కార్తికేయగారి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేశాం. త్వరలో సినిమా విడుదల తేదీ ప్రకటిస్తాం. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం డబ్బింగ్‌ పనులు చివరి దశలో ఉన్నాయి’’ అని అన్నారు. తాన్యా రవిచంద్రన్‌ హీరోయిన్‌గా, సుధాకర్‌ కోమాకుల, సాయికుమార్‌, తనికెళ్ల భరణి, పశుపతి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సమర్పణ: ఆదిరెడ్డి .టి.


Updated Date - 2021-09-22T06:25:16+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!