‘పక్కా కమర్షియల్’ టీజర్ విడుదలకు డేట్ ఫిక్స్
ABN, First Publish Date - 2021-11-07T03:37:52+05:30
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ - యూవీ క్రియేషన్స్ బ్యానర్లుపై మ్యాచో స్టార్ గోపీచంద్, రాశీఖన్నా జంటగా.. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో నిర్మాత బన్నీవాసు నిర్మిస్తున్న పక్కా మాస్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘పక్కా కమర్షియల్’. ఈ చిత్రానికి
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ - యూవీ క్రియేషన్స్ బ్యానర్లుపై మ్యాచో స్టార్ గోపీచంద్, రాశీఖన్నా జంటగా.. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో నిర్మాత బన్నీవాసు నిర్మిస్తున్న పక్కా మాస్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘పక్కా కమర్షియల్’. ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల విడుదలైన గ్లింప్స్ మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. గ్లింప్స్ తర్వాత ఈ చిత్రంపై భారీగా అంచనాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేసి చిత్రంపై మరింతగా అంచనాలు పెంచేందుకు చిత్రయూనిట్ రెడీ అయింది. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను నవంబర్ 8వ తేదీ సాయంత్రం 6 గంటలకు విడుదల చేయబోతున్నట్లుగా చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రానికి జేక్స్ బిజాయ్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.