రామ్ గోపాల్ వర్మ ‘లడకి’ చిత్ర ట్రైలర్: అరాచకం
ABN, First Publish Date - 2021-11-09T22:10:02+05:30
మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం ‘లడకి’. ఈ చిత్ర ట్రైలర్‌ను మంగళవారం సోషల్ మీడియా వేదికగా వర్మ విడుదల చేశారు. బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్ ఈ ట్రైలర్‌ను ట్వీట్ చేస్తూ.. సర్కార్ వర్మకు, చిత్ర టీమ్‌కు
మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం ‘లడకి’. ఈ చిత్ర ట్రైలర్‌ను మంగళవారం సోషల్ మీడియా వేదికగా వర్మ విడుదల చేశారు. బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్ ఈ ట్రైలర్‌ను ట్వీట్ చేస్తూ.. సర్కార్ వర్మకు, చిత్ర టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఆర్ట్‌సి మీడియా మరియు చైనా కంపెనీ బిగ్ పీపుల్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని.. మార్షల్ ఆర్ట్స్ రారాజు బ్రూస్‌లీ నటించిన ఎంటర్ ది డ్రాగన్ చిత్రానికి నివాళిగా తెరకెక్కించినట్లుగా మేకర్స్ తెలిపారు. ఈ చిత్రాన్ని హిందీ మరియు చైనా భాషలో కూడా విడుదల చేయనున్నారు. చైనాలో ‘డ్రాగన్ గర్ల్’ టైటిల్‌తో విడుదల చేయనున్నారు.
ఈ చిత్రంలో మార్షల్ ఆర్ట్స్‌లో నిపుణురాలైన పూజ భలేకర్ టైటిల్ రోల్ పోషిస్తున్నారు. తన ఫైటింగ్ స్కిల్స్ ఈ చిత్రానికి హైలైట్‌గా ఉండనున్నాయనేది ఈ ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. భారతదేశంలోనే మొదటి మార్షల్ ఆర్ట్స్ చిత్రంగా రూపొందిన ఈ చిత్రాన్ని బ్రూస్‌లీకి అంకితమిస్తున్నారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 10న విడుదల చేస్తున్నారు. విశేషం ఏమిటంటే చైనాలోని భారీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ అయిన చైనా ఫిలిం గ్రూప్ కార్పొరేషన్ వారు ఈ చిత్రాన్ని భారీ ప్రమోషన్‌తో 20 వేల థియేటర్స్‌లో విడుదల చేయనున్నారు. నవంబర్ 27న బ్రూస్‌లీ 81వ పుట్టిన రోజు సందర్భంగా దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాలో ‘లడకి ది డ్రాగన్ గర్ల్’ మొదటి పోస్టర్‌ను విడుదల చేయనుండగా.. అదే రోజు చైనాలోని ఫోషన్ కుంగ్ ఫు ఫిలిం ఫెస్టివల్‌లో ఈ చిత్ర ప్రీమియర్‌ను ప్రదర్శించనున్నారు. ఇక తాజాగా విడుదల చేసిన ట్రైలర్ విషయానికి వస్తే.. రామ్ గోపాల్ వర్మ ఈ చిత్రాన్ని దేనికోసం అయితే తెరకెక్కించారో.. అది మాత్రం అరాచకం అనేలా ఉంది. ముఖ్యంగా ఆయన కెమెరా పెట్టించిన తీరు.. అరాచకానికే అరాచకం అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారంటే.. ఈ సినిమా వెనుక వర్మ అంతరార్థం ఏమిటో అర్థం చేసుకోవచ్చు.