సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ఎవరికీ అందనంత ఎత్తులో

ABN, First Publish Date - 2021-11-02T08:43:05+05:30

కథానాయికగా రష్మిక ప్రయాణం మహా స్పీడుగా సాగిపోతోంది. చాలా తక్కువ సమయంలోనే స్టార్‌ నాయిక హోదా సంపాదించుకుంది. ఇప్పుడు సోషల్‌ మీడియాలోనూ తన ప్రతాపం చూపిస్తోంది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కథానాయికగా రష్మిక ప్రయాణం మహా స్పీడుగా సాగిపోతోంది. చాలా తక్కువ సమయంలోనే స్టార్‌ నాయిక హోదా సంపాదించుకుంది. ఇప్పుడు సోషల్‌ మీడియాలోనూ తన ప్రతాపం చూపిస్తోంది. ఇన్‌ స్టాలో రష్మికకు 23 మిలియన్ల ఫాలోవర్స్‌ ఉన్నారు. ఇదో రికార్డుగా అభివర్ణిస్తున్నారు నెటిజన్లు. ఇంత వరకూ ఏ కథానాయికకీ ఈ ఫీట్‌ సాధ్యం కాలేదు. సౌత్‌ ఇండియాలో స్టార్‌ హీరోయిన్ల సంఖ్య చాలా ఎక్కువ. వాళ్లెవరికీ... ఇన్‌స్టాలో అందనంత ఎత్తులో ఉంది రష్మిక. వరుసగా సూపర్‌ హిట్‌ సినిమాలు చేస్తూ ఉండడం ఇటు తెలుగులోనే కాకుండా, అటు తమిళంలోనూ, కన్నడలోనూ రష్మికకు పెద్ద ఎత్తున అభిమానులు ఉండడం, అన్నింటికంటే ఇన్‌స్టాలో ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్‌లో ఉండడం వల్ల... రష్మికకు ఇంతమంది ఫాలోవర్లు ఏర్పడ్డారు. ప్రస్తుతం రష్మిక ‘పుష్ష’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం డిసెంబరు 17న విడుదల కానుంది.


Updated Date - 2021-11-02T08:43:05+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!