‘శృతి’మించని డైట్!
ABN, First Publish Date - 2021-07-11T06:31:07+05:30
కథానాయిక శృతీహాసన్ తన ఆహారం ఏంటో ఇన్‌స్టాలో తన ఫాలోవర్స్‌కు అప్పుడప్పుడూ చెబుతుంటుంది. నిజాయతీగా తన డైట్ ప్లాన్‌ను ఆమె ఇంటర్వ్యూల్లో చెబుతుంటుంది.
కథానాయిక శృతీహాసన్ తన ఆహారం ఏంటో ఇన్‌స్టాలో తన ఫాలోవర్స్‌కు అప్పుడప్పుడూ చెబుతుంటుంది. నిజాయతీగా తన డైట్ ప్లాన్‌ను ఆమె ఇంటర్వ్యూల్లో చెబుతుంటుంది. శృతికి కాంటినెంటల్ ఫుడ్ ఇష్టమే. దక్షిణాది మీల్స్‌తో పాటు జపనీస్ ఫుడ్ అంటే మహా ఇష్టమట. ముఖ్యంగా అన్నం, పప్పు, సాంబారు, పెరుగుని అరటి ఆకుపై తినటానికి ప్రాధాన్యత ఇస్తుంది. సూప్స్, గ్రిల్డ్ చికెన్ అంటే లొట్టలేసుకుంటూ తింటుంది. ఇకపోతే పండ్లలో మామిడికాయకంటే సీతాఫలమే ప్రీతి అంటుంది ఈ అమ్మడు. కొబ్బరి నీళ్లు, జిలేబీ లాంటివి రోజైనా లాగిస్తానంటుంది శృతి. స్వతహాగా వంటింట్లోకి వెళ్లి కేక్స్ బాగా తయారు చేస్తుంది. వెనీలా ఐస్‌క్రీమ్, చాక్లెట్స్ తినటం అలవాటు. మొత్తానికి అన్నం తినకుండా కడుపు మాడ్చుకోవటం కంటే.. హాయిగా కాస్త లాగించి.. పర్ఫెక్ట్‌గా వర్కవుట్స్ చేయటం మంచిదంటుంది శృతీహాసన్.