సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

అరకులో రాజ‘శేఖర్‌’

ABN, First Publish Date - 2021-08-12T10:51:03+05:30

రాజశేఖర్‌ హీరోగా లలిత్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘శేఖర్‌’. అనూ సితార, ముస్కాన్‌ కుబ్‌చాందినీ హీరోయిన్లు. కరోనా రెండో దశ తర్వాత బుధవారం చిత్రీకరణ పునఃప్రారంభించారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజశేఖర్‌ హీరోగా లలిత్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘శేఖర్‌’. అనూ సితార, ముస్కాన్‌ కుబ్‌చాందినీ హీరోయిన్లు. కరోనా రెండో దశ తర్వాత బుధవారం చిత్రీకరణ పునఃప్రారంభించారు. ‘‘సుమారు 20 రోజులు అరకులో, తర్వాత హైదరాబాద్‌లో ఐదు రోజులు చిత్రీకరణ చేస్తాం. శ్రీశైలం లేదా నాగార్జున సాగర్‌లో వారం షెడ్యూల్‌ ప్లాన్‌ చేస్తున్నాం. అరకు షెడ్యూల్‌తో 75 శాతం చిత్రీకరణ పూర్తవుతుంది’’ అని నిర్మాతలు ఎం.ఎల్‌.వి. సత్యనారాయణ, శివాని, శివాత్మిక, వెంకట శ్రీనివాస్‌ బొగ్గారం తెలిపారు. ‘‘అరకులో రాజశేఖర్‌, అనూ సితార, ఇతర నటీనటులపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం’’ అని దర్శకుడు చెప్పారు. రాజశేఖర్‌ 91వ చిత్రమిది. దీనికి రచయిత: లక్ష్మీ భూపాల, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌.


Updated Date - 2021-08-12T10:51:03+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!