లింగుస్వామి-రామ్ సినిమాలో విలన్ భార్యగా ఎవరంటే?
ABN, First Publish Date - 2021-08-04T02:17:36+05:30
2001లో విడుదలైన ‘ఆనందం’ చిత్రం ద్వారా ఎన్.లింగుస్వామి కోలీవుడ్‌కు దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత ఆయన తెరకెక్కించిన ‘రన్’, ‘పైసా’, ‘సండైక్కోళి’ వంటి చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. దీంతో లింగుస్వామి
2001లో విడుదలైన ‘ఆనందం’ చిత్రం ద్వారా ఎన్.లింగుస్వామి కోలీవుడ్‌కు దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత ఆయన తెరకెక్కించిన ‘రన్’, ‘పైసా’, ‘సండైక్కోళి’ వంటి చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. దీంతో లింగుస్వామి స్టార్ దర్శకుల జాబితాలోకి చేరిపోయారు. ప్రస్తుతం టాలీవుడ్ యువ హీరో రామ్‌తో కలిసి ఆయన ఓ ప్రాజెక్టు తెరకెక్కిస్తున్నారు. తమిళ, తెలుగు భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ కాగా, దేవీశ్రీ ప్రసాద్ సంగీత బాణీలు సమకూర్చుతున్నారు. ఇందులో ఆది ప్రతినాయకుడిగా నటిస్తుండగా ఆయనకు జోడీగా అక్షరగౌడ నటించనుందని తెలుస్తోంది. అక్షర గౌడ ఈ చిత్రంలో నటిస్తోన్న విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. అక్షర గౌడ గతంలో హీరో అజిత్ ‘ఆరంభం’, విజయ్ ‘తుపాకీ’, జయం రవి ‘బోగన్’ వంటి చిత్రాల్లో నటించింది.