సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ఈడీ విచారణకు హాజరైన ఐశ్వర్యరాయ్‌

ABN, First Publish Date - 2021-12-21T05:56:37+05:30

పనామా కేసులో ప్రముఖ నటి ఐశ్వర్యరాయ్‌ ఈడీ విచారణకు హాజరయ్యారు. సోమవారం దిల్లీలోని ఈడీ కార్యాలయానికి వెళ్లి, ఆమె తన వాంగ్మూలం ఇచ్చారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పనామా కేసులో ప్రముఖ నటి ఐశ్వర్యరాయ్‌ ఈడీ విచారణకు హాజరయ్యారు. సోమవారం దిల్లీలోని ఈడీ కార్యాలయానికి వెళ్లి, ఆమె తన వాంగ్మూలం ఇచ్చారు. ఈ మేరకు ఈడీ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. పనామా దేశానికి సంబంధించిన మోకాస్‌ ఫొనెక్సా అనే కంపెనీలో భారతదేశం నుంచి చాలా మంది సెలబ్రెటీలు కోట్లాది రూపాయలు పెట్టుబడిగా పెట్టారు. అదో బోగస్‌ కంపెనీ అని ఆ తరవాత తేలింది. 2016లో ఐసీఐజే దీనిపై విచారణ చేపట్టి, దాదాపుగా 136 కోట్ల డాలర్ల అక్రమార్జన వివిధ కంపెనీలకు పెట్టుబడిగా వెళ్లిందన్న విషయాన్ని బహిర్గతం చేసింది. ఈ కేసులో బాలీవుడ్‌కు చెందిన వివిధ సెలబ్రెటీల పేర్లు వెలుగులోకి వచ్చాయి. వాళ్లందరినీ ఈడీ విచారిస్తోంది. అందులో భాగంగా ఐశ్వర్యరాయ్‌కి సైతం గతంలోనే ఈడీ సమన్లు పంపింది. కానీ ఆమె ఈడీ ముందు హాజరు కావడానికి కొంత సమయం అడిగారు. సోమవారం విచారణకు రావాల్సిందిగా ఈడీ మరోసారి ఐశ్వర్యరాయ్‌కి సమన్లు పంపింది. ‘ఇప్పుడు రావడం కుదరద’ని ఐష్‌ చెప్పినప్పటికీ, ఆమె సోమవారమే విచారణకు హాజరవ్వడం  విశేషం.


Updated Date - 2021-12-21T05:56:37+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!