సౌరవ్ గంగూలీ బయోపిక్..త్వరలోనే అధికారక ప్రకటన
ABN, First Publish Date - 2021-09-10T14:15:36+05:30
టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ జీవితచరిత్ర ఆధారంగా బయోపిక్ చిత్రం రూపొందనుంది. ఈ విషయాన్ని నిర్మాతలు, సౌరవ్ గంగూలీ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ జీవితచరిత్ర ఆధారంగా బయోపిక్ చిత్రం రూపొందనుంది. ఈ విషయాన్ని నిర్మాతలు, సౌరవ్ గంగూలీ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. లవ్ ఫిలింస్ బ్యానర్‌పై లవ్ రంజన్, అంకుర్ గార్గ్ ఈ బయోపిక్‌ను నిర్మించబోతున్నారు. ఈ క్రమంలో 'క్రికెట్ నా జీవితం. నేను గర్వంగా, తలెత్తుకునేలా చేసింది. నా ప్రయాణం బయోపిక్ రూపంలో వెండితెరపై రానుండటం పట్ల ఉద్వేగానికి లోనవుతున్నా'.. అని గంగూలీ ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా ఈ మూవీని తెరకెక్కించే దర్శకుడు, సౌరవ్ గంగూలీ పాత్రలో నటించే హీరో తదితర వివరాలను నిర్మాతలు త్వరలో ప్రకటించనున్నారు. అయితే బాలీవుడ్ మీడియా వర్గాల ద్వారా అందుతున్న సమాచారం మేరకు టైటీల్ రోల్‌లో రణ్‌బీర్ కపూర్ నటించే అవకాశాలున్నాయట.