సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

సోషల్ మీడియాలో క్రేజీగా మారిన ఫొటో.. ఈఫిల్ టవర్ ముందు ఉన్న ఈ జంట ఎవరంటే..

ABN, First Publish Date - 2021-11-24T02:41:15+05:30

బాలీవుడ్ సెలబ్రిటీలు సొషల్ మీడియా విషయంలో సూపర్ పాస్ట్ అయిపోతున్నారు. ఒకప్పుడు తమ ప్రైవేసికి భంగం కలుగుతోందని కంప్లైంట్ చేయటం ఆచారం అయితే... ఇప్పుడు అంతా, అన్నీ ఆన్‌లైన్‌లో షేర్ చేయటం ఫ్యాషన్ అయిపోయింది. తాజాగా బీ-టౌన్ బ్యూటిఫుల్ సింగర్...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్ సెలబ్రిటీలు సొషల్ మీడియా విషయంలో సూపర్ పాస్ట్ అయిపోతున్నారు. ఒకప్పుడు తమ ప్రైవేసికి భంగం కలుగుతోందని కంప్లైంట్ చేయటం ఆచారం అయితే... ఇప్పుడు అంతా, అన్నీ ఆన్‌లైన్‌లో షేర్ చేయటం ఫ్యాషన్ అయిపోయింది. తాజాగా బీ-టౌన్ బ్యూటిఫుల్ సింగర్ నేహ కక్కర్ తన రొమాంటిక్ ప్యారిస్ ట్రిప్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో రచ్చ చేస్తోంది. 


పోయిన సంవత్సరం అక్టోబర్‌లో రోహన్ ప్రీత్ సింగ్‌ను పెళ్లాడిన గార్జియస్ సింగర్ నేహా కక్కర్ ఆల్రెడీ ఫస్ట్ యానివర్సరీ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం లవ్ బర్డ్స్ ఇద్దరూ ప్యారిస్‌లో హల్‌చల్ చేస్తున్నారు. ప్రేమ పక్షులకు ఫేవరెట్ స్పాటైన ఫ్రెంచ్ క్యాపిటల్‌లో నేహా భర్తని ముద్దాడింది. అదీ ఎలాంటి దాపరికాలు లేకుండా ఈఫిల్ టవర్ ముందు! ప్యారిస్‌లోని ప్రపంచ ప్రఖ్యాత ఈఫిల్ ముందు నేహ, రోహన్ ఆలింగనం చేసుకుని ఒకరి కళ్లలోకి ఒకరు చూస్తూ మైమరిచిపోయారు. లిప్ లాక్ చేసుకుని రొమాంటిక్ ట్రాన్స్‌లో కెమెరాకు ఫోజిచ్చారు!


నేహా సొషల్ మీడియాలో పోస్ట్ చేసిన లిప్ లాక్ ఫోటోస్ సెలబ్రిటీల్ని కూడా మెస్మరైజ్ చేస్తున్నాయి. నేహా సొదరుడు టోనీ కక్కర్ ‘పిక్చర్ ఆప్ ద ఇయర్’ అంటూ కామెంట్ చేశాడు. ఇక బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా అయితే ఫ్రెంచ్ భాషలోనే కామెంట్ రాసింది. ఆమె కామెంట్‌లోని ఫ్రెంచ్ పదాలకు అర్థం... ‘‘జీవితంలో ఉన్నది ఒకే ఒక్క ఆనందం... ప్రేమించటం, ప్రేమించబడటం!’’

Updated Date - 2021-11-24T02:41:15+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!