కుమారుడి సినిమాకి మంచి టాక్ వచ్చిందని హీరోయిన్ డ్యాన్స్.. వీడియో వైరల్
ABN, First Publish Date - 2021-11-09T18:59:59+05:30
బాలీవుడ్ కండల వీరుడు, స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మూవీ ‘మైనే ప్యార్ కియా’తో చిత్ర పరిశ్రమకి పరిచయమైన నటి భాగ్యశ్రీ. మొదటి సినిమాతోనే అందంతో పాటు నటనతో అదరగొట్టిన ఈ సీనియర్ నటి అప్పటి యువత..
బాలీవుడ్ కండల వీరుడు, స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మూవీ ‘మైనే ప్యార్ కియా’తో చిత్ర పరిశ్రమకి పరిచయమైన నటి భాగ్యశ్రీ. మొదటి సినిమాతోనే అందంతో పాటు నటనతో అదరగొట్టిన ఈ సీనియర్ నటి అప్పటి యువత మనసులను దోచుకుంది. అయితే తాజాగా ఈమె కుమారుడు అభిమన్యు దాసాని హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఆయన తాజాగా నటించిన సినిమా ‘మీనాక్షి సుందరేశ్వర్’ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా తనయుడి విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంది ఈ నటి.
కుమారుడి సినిమాలో టిట్టర్ బిట్టర్ పాటకు డ్యాన్స్ చేస్తున్న వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేసింది. దీంతో ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో ఆమె డ్యాన్స్ చేసిన విధానం ఆకట్టుకుంది. పెళ్లై పిల్లలు ఉన్నప్పటికీ తనలోని అందం ఏ మాత్రం తగ్గలేదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా ఆమె కుమారుడి ఇలాంటి విజయాలు ఎన్నో అందుకోవాలని కోరుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు. కాగా, ‘దంగల్’ బ్యూటీ సన్యా మల్హోత్రా హీరోయిన్‌గా ‘మీనాక్షీ సుందరేశ్వర్’ మూవీకి మంచి చిత్రంగా ప్రశంసలు లభిస్తున్నాయి. అభిమన్యు చాలా డిగ్నిఫైడ్‌గా ఉండటమే కాకుండా తన పాత్రకి న్యాయం చేశాడని కామెంట్స్ చేస్తున్నారు.