సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

మా నాన్న బూతులు మాట్లాడతాడు.. మా అమ్మ పోర్న్ సైట్ నడుపుతోంది అనుకునేదాన్ని: Sara Ali Khan

ABN, First Publish Date - 2021-11-03T17:23:42+05:30

బాలీవుడ్ ప్రముఖ కథానాయకుడు సైఫ్ అలీ ఖాన్ నట వారసురాలిగా తెరంగేట్రం చేసి మంచి గుర్తింపు సంపాదించుకుంది సారా అలీ ఖాన్.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్ ప్రముఖ కథానాయకుడు సైఫ్ అలీ ఖాన్ నట వారసురాలిగా తెరంగేట్రం చేసి మంచి గుర్తింపు సంపాదించుకుంది సారా అలీ ఖాన్. సారా తల్లి అమృతా సింగ్ కూడా బాలీవుడ్ సినిమాల్లో నటించింది. 1991లో వివాహం చేసుకున్న సైఫ్, అమృత 2004లో విడాకులు తీసుకున్నారు. వీరికి సారా, ఇబ్రహీం జన్మించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన సారా తన తల్లిదండ్రులతో అనుబంధం గురించి మాట్లాడింది.


`నా చిన్నతనంలో మా అమ్మానాన్నల గురించి నేను తప్పుగా ఆలోచించేదాన్ని. వారు మంచి వారు కారు అనుకునేదాన్ని. దానికి కారణం 2005లో విడుదలైన `కలియుగ్`, 2006లో రిలీజ్ అయిన `ఓంకార`. అప్పటికి నా వయసు 10 సంవత్సరాలు. `కలియుగ్‌`లో నెగిటివ్ రోల్‌లో కనిపించిన మా అమ్మ పోర్న్ సైట్ నడుపుతుంటుంది. ఇక, `ఓంకార`లో మా నాన్న బూతులు మాట్లాడే విలన్ పాత్రలో నటించారు. ఆయా సినిమాలకు గాను వారికి అవార్డులు కూడా వచ్చాయి. ఇంత చెడ్డవారికి అవార్డులు ఎలా ఇచ్చారని నేను అనుకునేదాన్ని. వారు నిజజీవితంలో కూడా అలాంటి పనులే చేస్తారని అనుకునేదాన్న`ని సారా చెప్పింది.  


Updated Date - 2021-11-03T17:23:42+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!