సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

నాకు భార్య.. కూతురు ఉన్నారా?

ABN, First Publish Date - 2021-07-23T10:36:19+05:30

బాలీవుడ్‌లో మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌ ఎవరంటే కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌ పేరు మొదట వినిపిస్తుంది. ఇప్పటికే ఆయన పెళ్లి, రిలేషన్‌షిప్స్‌, డేటింగ్‌ల గురించి ఎన్నో వార్తలొచ్చాయి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్‌లో మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌ ఎవరంటే కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌ పేరు మొదట వినిపిస్తుంది. ఇప్పటికే ఆయన పెళ్లి, రిలేషన్‌షిప్స్‌, డేటింగ్‌ల గురించి ఎన్నో వార్తలొచ్చాయి. అయితే సల్మాన్‌ఖాన్‌ ఎప్పటికప్పుడు వాటిని కొట్టిపడేస్తుండేవారు. 55 ఏళ్ల సల్మాన్‌కు పెళ్లై భార్య ఉందని, 17 ఏళ్ల కూతురు ఉందని వారు దుబాయ్‌లో ఉంటున్నారనే వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. దీనిపై తాజాగా సల్మాన్‌ స్పందించారు. ఆయన సోదరుడు అర్బజ్‌ఖాన్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘పించ్‌’ టాక్‌ షోకు సల్మాన్‌ అతిథిగా  హాజరయ్యారు. ఈ షో 21వ ఎపిసోడ్‌ ఈ నెల 21న స్ర్టీమింగ్‌ అయింది. సోషల్‌  మీడియాలో తమపై ట్రోల్‌ అయిన ప్రశ్నలకు సమాధానం చెప్పడం ఈ షో ముఖ్య ఉద్దేశం. సల్మాన్‌ఖాన్‌ తన కెరీర్‌, సినిమాలు, గాసిప్‌ల గురించి అర్బజ్‌ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ‘‘ఇటీవల ఓ నెటిజన్‌ మీకు దుబాయ్‌లో భార్య, 17 ఏళ్ల కూతురు ఉన్నారని ఆరోపిస్తూ ట్వీట్‌ చేశారు. అది నిజమా?, అన్న ప్రశ్నకు ‘‘జనాలకు ఇలాంటి సమాచారం ఎలా అందుతుందో నాకు తెలీదు. ఇలాంటి చర్చల వల్ల ఏ ఉపయోగం లేదు. దీని వల్ల వారికి ఏం కలిసొస్తుందో నాకు అర్థం కావడం లేదు. ఈ కామెంట్లు చేసిన వ్యక్తుల పేర్లు నా నోట చెప్పించే ప్రయత్నం కావచ్చు. వారి ప్రచారం కోసం కొందరు రాసే రాతలివి. తొమ్మిదో సంవత్సరం నుంచి నేను ముంబైలోనే ఉంటున్నా. నాన్న కూడా నాతోనే ఉంటున్నారు. ఈ విషయం అందరికీ తెలిసిందే’’ అని చెప్పారు. ‘సల్మాన్‌ఖాన్‌ మంచి మనిషి కాదు మంచోడిలా యాక్ట్‌ చేస్తున్నాడు’ అని మరో నెటిజన్‌ చేసిన కామెంట్‌కు ‘‘అతనికి నాతో ఎక్కడైనా చెడు అనుభవం ఎదురై ఉండొచ్చు. తన భార్య నన్ను బాగా పొగడ్తలతో ముంచెత్తి ఉండాలి.. లేదా తన కూతురు నా సినిమా చూపించమని అయినా అడిగి ఉంటుంది’’ అని సిల్లీ సమాధానం ఇచ్చారు. 


Updated Date - 2021-07-23T10:36:19+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!