సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ఈ సెలెబ్రిటీ చేతిలో ఉన్న హ్యాండ్ బ్యాగ్ ధర తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే.

ABN, First Publish Date - 2021-10-17T00:25:24+05:30

బాహుబలి సినిమాలో మనోహరి పాటలో కనిపించి కుర్రకారు మదిని దోచిన ఐటమ్ భామ నోరా ఫతేహీ. తాజాగా 200కోట్ల మనీ లాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎదుట విచారణకు హాజరైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాహుబలి సినిమాలో మనోహరి పాటలో కనిపించి కుర్రకారు మదిని దోచిన ఐటమ్ భామ నోరా ఫతేహీ. తాజాగా 200కోట్ల మనీ లాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్  డైరెక్టరేట్(ఈడీ) ఎదుట విచారణకు హాజరైంది. ఆమె లగ్జరీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే లక్షల రూపాయాల విలువైన హ్యాండ్ బ్యాగ్‌ను ధరించి అభిమానులకు దర్శనమిచ్చింది. 


నోరా ఫతేహీ కింది నంచి మీది దాకా నీలం రంగు డ్రెస్ ధరించి అభిమానులకు కనువిందు చేసింది. బ్లూ కలర్ టీ షర్ట్, షార్ట్స్ ధరించి కనిపించింది. ఆమె  హ్యాండ్ బ్యాగ్‌ను ధరించిన లుక్స్ నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఎందుకంటే దాని ధర ఎంతో తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే. దాదాపుగా రూ.1.95లక్షల విలువైన మినీ లూయిస్ విట్టన్ పామ్ స్ప్రింగ్స్ బ్రాండ్‌కు చెందిన  బ్యాగ్‌ను ధరించి ఆమె కనిపించింది. ఆ బ్యాగ్‌ను చూసిన అభిమానులు అవాక్కయ్యారు.


అజయ్ దేవగణ్ హీరోగా నటించిన ‘‘ భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా ’’ సినిమాలో స్పై పాత్రలో కనిపించింది. ఈ సినిమాలో సంజయ్ దత్, సోనాక్షి సిన్హా, శరద్ కేల్కర్ కీలక పాత్రలు పోషించారు.  ఆ సినిమాకు అభిషేక్ దర్శకత్వం వహించారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఆ చిత్రం విడుదలయింది. 

Updated Date - 2021-10-17T00:25:24+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!