సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

బాలయ్య సినిమా నుంచి ఆమెను తప్పించారా?

ABN, First Publish Date - 2020-11-06T16:29:15+05:30

నటరత్న నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నటరత్న నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. `సింహా`, `లెజెండ్` వంటి విజయాల తర్వాత వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే వారణాసిలో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ నెల 15 నుంచి బాలయ్య ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనబోతున్నారట.


ఈ సినిమాలో బాలయ్య సరసన మలయాళ భామ ప్రయాగ మార్టిన్‌ను హీరోయిన్‌గా తీసుకున్నారు. తెలుగులో ఈమెకు ఇదే తొలి సినిమా. అయితే ఆమెను తప్పించినట్టు తాజా సమాచారం. బాలయ్య, ప్రయగ జోడీ ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు టెస్ట్ షూట్ చేశారట. అయితే బాలయ్య పక్కన పాతికేళ్ల ప్రయాగ చిన్నపిల్లలా కనిపించిందట. దీంతో ఈ జోడీ బాగోలేదని నిర్ధారణకు వచ్చి ఆమెను సినిమా నుంచి తప్పించినట్టు తాజా సమాచారం. దీంతో హీరోయిన్ వేట మళ్లీ మొదటికి వచ్చినట్టైంది. ఈ సినిమాలో సెకెండ్  హీరోయిన్‌ పాత్రకు పూర్ణను సెలెక్ట్ చేసినట్టు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. 

Updated Date - 2020-11-06T16:29:15+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!