సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ హీరో.. ‘రీసెట్’ అయ్యే ప్రయత్నం

ABN, First Publish Date - 2020-11-13T00:31:06+05:30

'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్', 'ఉందిలే మంచి కాలం ముందు ముందునా', 'నువ్వు తోపురా' వంటి చిత్రాలతో కథానాయకుడిగా స్థిరపడేందుకు, తనకంటూ ఓ ప్రత్యేక

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్', 'ఉందిలే మంచి కాలం ముందు ముందునా', 'నువ్వు తోపురా' వంటి చిత్రాలతో కథానాయకుడిగా స్థిరపడేందుకు, తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకునేందుకు సుధాకర్ కోమాకుల ప్రయత్నాలు చేస్తున్నారు. వీటిలో 'లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌' చిత్రంలో ఆయన మాట్లాడే యాసతో మంచి పేరు తెచ్చుకున్న సుధాకర్‌కు.. ఆ తర్వాత చేసిన చిత్రాలు అంతగా పేరును సంపాదించిపెట్టలేకపోయాయి. మళ్లీ ఆయన రీసెంట్ అయ్యేందుకు ఇప్పుడు 'రీసెట్' పేరుతో మరో విభిన్నమైన చిత్రం చేయబోతున్నారు. ఈ చిత్రం ద్వారా అజ్జు మహాకాళి దర్శకునిగా పరిచయమౌతున్నారు. సుఖ స్టూడియోస్ సమర్పణలో హైలైట్ విజువల్స్, కారా బూందీ ప్రొడక్షన్స్ సంయుక్త నిర్మాణంలో ఈ చిత్రం రూపొందనుంది. గురువారం (నవంబర్ 12) హీరో సుధాకర్ కోమాకుల పుట్టినరోజు సందర్బంగా టైటిల్ పోస్టర్‌ను చిత్రయూనిట్‌ విడుదల చేసింది.


దర్శకుడు అజ్జు మహాకాళి చిత్ర విశేషాలను తెలుపుతూ.. ''న్యూ యార్క్ ఫిల్మ్ అకాడమీలో డిప్లమో ఇన్ ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేశాను. సుధాకర్ కోమాకుల హీరోగా నటించిన 'నువ్వు తోపు రా'కి కథ- మాటలు అందించాను. దర్శకునిగా ఇదే నా తొలి ప్రయత్నం. కథ నచ్చి సుధాకర్ వెంటనే ఈ సినిమా చేయటానికి ఒప్పుకున్నారు. లాక్ డౌన్ 1.0 టైం లో జరిగే క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఇది. ఇందులో హీరో క్యారెక్టర్ చాలా విభిన్నంగా ఉంటుంది. ప్రపంచం లాక్ డౌన్ అయినాకనే అతని ప్రపంచం ఓపెన్ అయ్యింది. ఈ సినిమా మెయిన్ థీమ్ ఏంటంటే- వాస్తవం, కల్పితం కన్నా కిరాక్‌గా ఉంటది. డిసెంబర్‌లో చిత్రీకరణ మొదలుపెడతాం'' అని తెలిపారు.  ఈ చిత్రానికి సిద్ధం మనోహర్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. డెన్నిస్‌ నార్టన్‌ సంగీతం అందిస్తున్నారు.  

Updated Date - 2020-11-13T00:31:06+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!