సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

నా పుట్టినరోజు వేడుకలు విరమించుకోండి

ABN, First Publish Date - 2020-03-19T04:54:22+05:30

‘‘నాపై మీకున్న ప్రేమ, నా పుట్టినరోజుని పండుగలా జరపడానికి మీరు పడుతున్న కష్టాన్ని నేను అర్థం చేసుకోగలను. అయితే... మనం ఉన్న అసాధారణ పరిస్థితులు మీకు తెలియనవి కావు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘‘నాపై మీకున్న ప్రేమ, నా పుట్టినరోజుని పండుగలా జరపడానికి మీరు పడుతున్న కష్టాన్ని నేను అర్థం చేసుకోగలను. అయితే... మనం ఉన్న అసాధారణ పరిస్థితులు మీకు తెలియనవి కావు. ఇటువంటి సందర్భాల్లో సాధ్యమైనంత వరకూ జనసాంద్రత తక్కువ ఉండేలా చూసుకోవడం మంచిది. ఇది నా మనసులో పెట్టుకుని నా పుట్టినరోజు వేడుకలు విరమించుకోవాల్సిందిగా నా మనవి’’ అని రామ్‌చరణ్‌ అన్నారు. మార్చి 27న ఆయన పుట్టినరోజు. మెగా అభిమానులు పెద్ద ఎత్తున వేడుకలు జరపడానికి సిద్ధమవుతున్నారు. కొందరు సినీ ప్రముఖుల్ని ఆహ్వానించి ప్రత్యేక కార్యక్రమాలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం కరోనా వ్యాధి విజృంభిస్తున్న నేపథ్యంలో తన పుట్టినరోజు వేడుకలను రద్దు చేసుకోవాల్సిందిగా అభిమానులకు రామ్‌చరణ్‌ విజ్ఞప్తి చేశారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘అభిమానులూ... మీరంతా అధికారులకు సహకరించి, కరోనా వ్యాప్తిని అరికట్టే విధానాలు ప్రజలకు అర్థమయ్యేలా తెలియజేసి మీవంతు సామాజిక బాధ్యత నెరవేర్చండి. అదే ఈ ఏడాది మీరు నాకు ఇచ్చే అతి పెద్ద పుట్టినరోజు కానుక’’ అన్నారు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో అల్లూరి సీతారామ రాజు పాత్రలో రామ్‌చరణ్‌ నటిస్తున్నారు. కొమరం భీమ్‌ పాత్రలో చిన్న ఎన్టీఆర్‌ నటిస్తున్నారు. రామ్‌చరణ్‌ పుట్టినరోజు కానుకగా సినిమాలో ఆయన లుక్‌ విడుదల చేస్తారని వినికిడి.

Updated Date - 2020-03-19T04:54:22+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!