తన కొత్త సినిమాకు టైటిల్ ప్రకటించిన సతీశ్ వేగేశ్న
ABN, First Publish Date - 2020-08-29T18:20:25+05:30
సతీష్ వేగేశ్న పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ చిత్రానికి ‘కోతి కొమ్మచ్చి’ అనే టైటిల్‌ను ఖరారు అనౌన్స్ చేశారు.
జాతీయ అవార్డు దక్కించుకున్న‘శతమానం భవతి’ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు సతీశ్ వేగేశ్న. ఈయన దర్శకత్వంలో స్వర్గీయ శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి, సతీశ్ వేగేశ్న తనయుడు సమీర్ వేగేశ్న ప్రధాన పాత్రధారులుగా ఓ సినిమాను చేయబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈరోజు సతీష్ వేగేశ్న పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ చిత్రానికి ‘కోతి కొమ్మచ్చి’ అనే టైటిల్‌ను ఖరారు అనౌన్స్ చేశారు. లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎం.ఎల్.వి.సత్యనారాయణ(సత్తిబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోన్న ఈ చిత్రం షూటింగ్ కరోనా వైరస్ ప్రభావం తగ్గిన తర్వాత ప్రారంభించేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.