సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

పేదలకు పండగ సరుకులు.. సల్మాన్‌ఖాన్‌పై నెటిజన్ల ప్రశంసలు

ABN, First Publish Date - 2020-05-26T20:50:51+05:30

లాక్‌డౌన్ కారణంగా ఎందరో పేద ముస్లింలు రంజాన్ పండుగను జరుపుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: ఒకపక్క కరోనా, మరోపక్క లాక్‌డౌన్ కారణంగా పేదప్రజలు ఆర్థికంగా చితికిపోతున్నారు. ఈ నేపథ్యంలో అనేకమందికి పూట గడవడమే కష్టమైపోయింది. ఇక పండుగ జరుపుకొనే ఆలోచన ఎలా ఉంటుంది. అటువంటి వారి ఇళ్లలో పండగ వెలుగులు నింపేందుకు బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నడుం బిగించాడు.  దాదాపు 5000 కుటుంబాలకు పండుగ జరుపుకొనేందుకు అవసరమైన సరుకులను పంపిణీ చేశఆరు. రంజాన్‌ సందర్భంగా షీర్ కొర్మా(రంజాన్ ప్రత్యేక వంటకం) చేసుకునేందుకు అవసరమైన సరుకులను ప్రత్యేక కిట్ల రూపంలో వారికి అందజేశాడు.  దీనికి సంబంధించిన ఫోటోలను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసిన శివసేన నేత రాహుల్ కనాల్ సల్మాన్‌ను ఆకాశానికెత్తేశారు. మంచి మనసుతో పేదలకు సాయం చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ‘సల్మాన్ భాయ్ నీకు కృతజ్ఞతలు. పండగ రోజున 5000 కుటుంబాల్లో ఆనందాన్ని నింపేందుకు మీరు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది. మీలాంటి వారు సమజానికి ఎంతో అవసరం’ అంటూ ప్రశంసించారు.


‘బీయింగ్ హంగ్రీ’ద్వారా ఇప్పటికే 25వేల మందికి రేషన్ సరుకులను అందజేయడం జరిగిందని, ఇప్పడు 5000 మందికి పండగ సరుకులను అందజేశామని రాహుల్ చెప్పారు. ప్రజలకు సేవ చేసే ఈ కార్యక్రమంలో తనను కూడా భాగస్వామిని చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉంటే పేద ముస్లింల కోసం సల్మాన్ ప్రత్యేక కిట్లు పంపిణీ చేయడంతో నెటిజన్లు ఆయనను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. రియల్ హీరో అని, సల్మాన్ ది బెస్ట్ అని, మ్యాన్ విత్ గోల్డెన్ హార్ట్ అని పొగడ్తల్లో ముంచేస్తున్నారు.

Updated Date - 2020-05-26T20:50:51+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!