సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

తొలి హీరో రామ్ కావడం గ్రేట్

ABN, First Publish Date - 2020-06-08T00:39:57+05:30

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనికి బాలీవుడ్‌లోనూ సూపర్ క్రేజ్ ఉంది. తెలుగులో ఫ్లాప్ అయిన సినిమాలు సైతం అక్కడ....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనికి బాలీవుడ్‌లోనూ సూపర్ క్రేజ్ ఉంది. తెలుగులో ఫ్లాప్ అయిన సినిమాలు సైతం అక్కడ డబ్ అయ్యి యూ ట్యూబ్‌లో విపరీతంగా ఆదరణ పొందుతుంటాయి. దానికి తగ్గట్టుగానే రామ్ పోతినేని సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో రామ్ పోతినేనికి 1.7 మిలియన్ ఫాలోయర్స్ ఉండగా, ట్విట్టర్‌లో 2.2 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే... రామ్ పోతినేనికి యూట్యూబ్‌కు సంబంధించి ఓ సరికొత్త రికార్డ్ సృష్టించాడు.



రామ్ పోతినేనికి మొదటి నుండీ యూ ట్యూబ్ మీద మంచి పట్టుంది. దానికి తగ్గట్టుగానే అతని సినిమాల పాటలకు మిలియన్ల కొద్ది వ్యూస్ లభిస్తుంటాయి. రామ్ నటించిన 'నేను శైలజ' మూవీలోని 'ఏం చెప్పను' పాటకు 121 మిలియన్ వ్యూస్ దక్కగా, అదే సినిమాలోని 'క్రేజీ ఫీలింగ్' పాటకు 111 మిలియన్ వ్యూస్ లభించాయి. ఇదిలా ఉంటే... రామ్ యూట్యూబ్ ఛానెల్ మిలియన్ సబ్ స్ర్కైబర్స్ మైలురాయిని చేరింది. సౌతిండియాలో ఈ మార్క్ అందుకున్న తొలి హీరో రామ్ కావడం గ్రేట్!

Updated Date - 2020-06-08T00:39:57+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!