సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

నా చెల్లెలు లేని లోటు తెలుస్తుంది: రాజీవ్ కనకాల

ABN, First Publish Date - 2020-08-04T00:33:19+05:30

తన చెల్లెలు లేని లోటు ఇప్పుడు తెలుస్తుంది అన్నారు సినీ నటుడు రాజీవ్ కనకాల. అన్నా చెల్లెల మ‌ధ్య అనుబంధం, ప్రేమ‌ల‌ను తెలియ‌జేసే పండుగ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తన చెల్లెలు లేని లోటు ఇప్పుడు తెలుస్తుంది అన్నారు సినీ నటుడు రాజీవ్ కనకాల. అన్నా చెల్లెల మ‌ధ్య అనుబంధం, ప్రేమ‌ల‌ను తెలియ‌జేసే పండుగ ర‌క్షాబంధ‌న్. ఆ పండుగను పురస్కరించుకుని తన చెల్లిని గుర్తు చేసుకుంటూ ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. ఇటీవల తన చెల్లెలు శ్రీలక్మి కనకాల క్యాన్సర్‌తో మృతి చెందిన విషయం తెలిసిందే. తన చెల్లెలు ఉండి ఉంటే.. ఈ రోజు రాఖీ కట్టి ఉండేదని, ఆమె లేని లోటు ఇప్పుడు తెలుస్తుందని రాజీవ్ కనకాల ట్వీట్ చేశారు.


‘‘నా సోదరి నాపై చూపించే అనురాగానికి విలువ కట్టలేను. ప్రతి రాఖీ పౌర్ణమి రోజున తను నాకు రాఖీ కడ్తుంటే అప్పుడు నాకు ఆ విలువ తెలిసేది కాదు. నిజమేనేమో, ఎవరైనా మనకు దూరం ఐతే తప్ప ఆ విలువ తెలీదు కావచ్చు. ఈ రాఖీ పౌర్ణమికి నా చెల్లెలు లేని లోటు నేను మాటలో చెప్పలేను..’’ అని రాజీవ్ కనకాల తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 



Updated Date - 2020-08-04T00:33:19+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!