సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

‘తమిళ ప్రేక్షకుల్ని సంతృప్తిపరచడం అంత సులభం కాదు’

ABN, First Publish Date - 2020-02-10T17:06:39+05:30

ఈ చిత్రం ఆడియో, ట్రైలర్‌ను ఆదివారం ఉదయం చెన్నైలో విడుదల చేశారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ‘మిరట్చి’ ఆడియో వేడుకలో జీవా

టేక్‌ ఓకే క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఎంవీ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మిరట్చి’. జితన్‌ రమేష్‌ తొలిసారి విలన్‌ పాత్రలో నటించారు. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం ఆడియో, ట్రైలర్‌ను ఆదివారం ఉదయం చెన్నైలో      విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జీవా ముఖ్య అతిథిగా పాల్గొని పాటలను ఆవిష్కరించారు. ఆ సందర్భంగా జీవా మాట్లాడుతూ, ‘సినీ పరిశ్రమలో ప్రతి ఒక్కరూ విజయం కోసం చాలా శ్రమిస్తున్నారు. వారందరి ప్రతిభ ఏదో ఒక రోజు ఏదో ఒక రకంగా బయటకి వస్తుంది. షారూక్‌ ఖాన్‌ను ‘డర్‌’ తరహాలో రమేష్‌కు ఈ చిత్రం గుర్తింపునిస్తుందని నమ్ముతున్నాను. ‘రామ్‌’ చిత్రంలో నటిస్తున్నప్పుడు నేను విలనా, యాంటీ హీరోనా తెలియకుండానే నటించాను. 


కానీ, ఇప్పుడు విలన్‌ పాత్రలను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. అయినా తమిళ ప్రేక్షకుల అభిరుచే వేరు. హాలీవుడ్‌ సినిమాలను కూడా అన్ని వర్గాల్ని సంతృప్తిపరిచేలా తీయవచ్చుగానీ, తమిళ ప్రేక్షకుల్ని సంతృప్తిపరచడం అంత సులభం కాదు. భారతదేశంలో, ముఖ్యంగా తమిళనాడులో భిన్నమైన అభిరుచులు కలిగిన ప్రజలు ఉన్నారు. ‘మిరట్చి’ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందనే నమ్ముతున్నాను’ అని పేర్కొన్నారు. కాగా, ఈ చిత్రానికి ఆనంద్‌ సంగీతం సమకూర్చారు.

Updated Date - 2020-02-10T17:06:39+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!