సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

మా తుజే సలాం...బాలీవుడ్ నటి షబానాఅజ్మీ ట్వీట్ వైరల్

ABN, First Publish Date - 2020-09-24T14:48:02+05:30

ప్రముఖ బాలీవుడ్ నటి షబానాఅజ్మీ తన ట్విట్టర్‌లో షేర్ చేసిన చిత్రం వైరల్‌గా మారింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : ప్రముఖ బాలీవుడ్ నటి షబానాఅజ్మీ తన ట్విట్టర్‌లో షేర్ చేసిన చిత్రం వైరల్‌గా మారింది. తన పసిబిడ్డను ఎత్తుకొని తలపై ఇటుకలు మోస్తున్న మహిళ చిత్రాన్ని షబానాఅజ్మీ పోస్టు చేసి, దానికి ఎఆర్ రెహమాన్ పాటలోని ‘‘మా తుజే సలాం’’అని క్యాప్షన్ పెట్టారు. భవననిర్మాణ కార్మికురాలు అయిన ఓ మహిళ తన భుజాలకు కట్టిన చీరలో తన బిడ్డను మోస్తూ ఇటుకలు ఎత్తిన చిత్రాన్ని షబానా అజ్మీ పోస్టు చేశారు. ఒకవైపు మహిళా కార్మికురాలు తన బిడ్డను మోస్తూ తలపై ఆరు ఇటుకలు ఎత్తుకున్న చిత్రం నెటిజన్లను కదిలించింది. శ్రమతో కూడిన కూలీ పనితో పిల్లల సంరక్షణ విధులను సమతుల్యం చేసిన మహిళను చాలామంది ప్రశంసించారు. మా తుజే సలాం శీర్షికతో షబానా పోస్టు చేసిన చిత్రానికి 5వేల లైక్ లు వందలాది రీట్వీట్లు వెల్లువెత్తాయి.  

Updated Date - 2020-09-24T14:48:02+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!