సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో హీరో సందీప్ కిషన్

ABN, First Publish Date - 2020-08-05T00:12:01+05:30

రాజసభ సభ్యులు, ప్రముఖ రాజకీయ నాయకులు జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో యువ హీరో సందీప్‌ కిషన్‌ పాల్గొన్నారు. ఛాలెంజ్‌లో భాగంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజసభ సభ్యులు, ప్రముఖ రాజకీయ నాయకులు జోగినిపల్లి సంతోష్‌ కుమార్‌ ప్రారంభించిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో యువ హీరో సందీప్‌ కిషన్‌ పాల్గొన్నారు. ఛాలెంజ్‌లో భాగంగా నటి లక్ష్మీ మంచు, నటుడు జీవన్‌రెడ్డి విసిరిన సవాల్‌ను స్వీకరించిన ఆయన, హైదరాబాద్‌లోని తమ ఇంటి ఆవరణలో మంగళవారం మొక్కలు నాటారు. 


ఈ సందర్భంగా సందీప్‌ కిషన్‌ మాట్లాడుతూ.. ‘‘ప్రకృతి ప్రేమికుడిగా మొక్కలు నాటడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. భూమితల్లి పచ్చగా ఉంటే, భూమిపై ఉన్న బిడ్డలందరూ క్షేమంగా ఉంటారు. మనకు ప్రాణవాయువు ఇచ్చే పచ్చని చెట్లు పెంచడం ముఖ్యం. మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంతోష్‌ కుమార్‌కి కృతజ్ఞతలు. గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొనవలసిందిగా నా అభిమానులు, ప్రేక్షకులకు పిలుపునిస్తున్నాను..’’  అని అన్నారు.



Updated Date - 2020-08-05T00:12:01+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!