సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

బాలీవుడ్‌పై విమర్శలు.. హేమా మాలిని స్పందన!

ABN, First Publish Date - 2020-09-16T22:40:45+05:30

కాస్టింగ్ కౌచ్, బంధుప్రీతి, డ్రగ్స్ వాడకం.. బాలీవుడ్‌లోని చీకటి కోణాలపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాస్టింగ్ కౌచ్, బంధుప్రీతి, డ్రగ్స్ వాడకం.. బాలీవుడ్‌లోని చీకటి కోణాలపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్యుల నుంచి రాజకీయ ప్రముఖుల వరకు అందరూ బాలీవుడ్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ వేడి తాజాగా పార్లమెంట్‌నూ తాకింది. బీజేపీ ఎంపీ రవికిషన్ బాలీవుడ్‌పై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ విమర్శలకు రాజ్యసభలో జయాబచ్చన్ కౌంటర్ ఇచ్చారు. ఎవరో కొందరు చేసిన తప్పులకు బాలీవుడ్ మొత్తాన్నీ నిందించడం సరికాదని ఆమె హితువు పలికారు. 


జయాబచ్చన్‌కు తాజాగా బీజేపీ నాయకురాలు హేమా మాలిని మద్దతుగా నిలిచారు. `బాలీవుడ్ నాకు పేరు, డబ్బు, గౌరవం.. అన్నీ ఇచ్చింది. తల్లి లాంటి పరిశ్రమపై విమర్శలు వింటుంటే చాలా బాధగా ఉంది. బాలీవుడ్ చాలా అందమైనది. ఓ సృజనాత్మక ప్రపంచం. డ్రగ్స్, బంధుప్రీతి వంటి కారణాలు చూపించి అందరూ బాలీవుడ్‌ను విమర్శస్తుంటే చాలా బాధగా ఉంది. చెడు ఎక్కడ ఉండదు? ఎంతో మంది దిగ్గజాలను బాలీవుడ్ ఈ ప్రపంచానికి అందించింది. రాజ్‌కపూర్, దేవ్ ఆనంద్, ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్.. వీరందరినీ ప్రజలు దేవుళ్లుగా భావించారు. బాలీవుడ్ అంటే భారత్` అని హేమా మాలిని పేర్కొన్నారు. 

Updated Date - 2020-09-16T22:40:45+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!