సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

సుశాంత్ కేసు.. సీబీఐ విచార‌ణ‌కు కేంద్రం గ్రీన్ సిగ్న‌ల్‌

ABN, First Publish Date - 2020-08-05T20:02:12+05:30

సుశాంత్ కేసును సీబీఐకి అప్ప‌గించ‌డానికి ఒప్పుకున్న‌ట్లు సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ తుషార్ మెహ‌తా బుధ‌వారం సుప్రీంకోర్టుకు తెలియ‌జేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్ క‌థానాయ‌కుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్య‌పై బాలీవుడ్‌లో పెనుదుమారం రేగింది. అప్ప‌టి నుండి సుశాంత్ మ‌ర‌ణంపై ప‌లు ర‌కాల వార్త‌లు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తూనే ఉన్నాయి. ఒక‌వైపు నెపోటిజం కార‌ణంగానే సుశాంత్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నార‌ని కొంద‌రు అంటుంటే.. మరో వైపు సుశాంత్‌ది ఆత్మ‌హ‌త్య కాదు, హ‌త్య అని కంగ‌నాలాంటి వ్య‌క్తులు వాదిస్తున్నారు. ఈ త‌రుణంలో సుశాంత్ కేసును సీబీఐకి అప్ప‌గించాల‌ని బీహార్ ప్ర‌భుత్వం కేంద్ర ప్ర‌భుత్వానికి సిఫార‌సు చేసింది . ఈ విజ్ఞ‌ప్తిని కేంద్ర ప్ర‌భుత్వం అంగీక‌రించి సుశాంత్ కేసును సీబీఐకి అప్ప‌గించ‌డానికి ఒప్పుకున్న‌ట్లు సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ తుషార్ మెహ‌తా బుధ‌వారం సుప్రీంకోర్టుకు తెలియ‌జేశారు. మ‌రోవైపు సుప్రీంకోర్టుని ఈ కేసుని పాట్నా నుండి ముంబైకి మార్చాలంటూ సుశాంత్ కేసులో అనుమానిత‌రాలైన ఆయ‌న ప్రియురాలు రియా చ‌క్ర‌వ‌ర్తి వేసిన పిటిష‌న్‌ను కూడా ప‌రిశీలించింది. 

Updated Date - 2020-08-05T20:02:12+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!