సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ప్రభాస్ నా కొడుకు: అనుష్క సంచలన సమాధానం

ABN, First Publish Date - 2020-03-19T18:26:13+05:30

`భాగమతి` తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న అనుష్క తాజాగా చేసిన చిత్రం `నిశ్శబ్దం`.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

`భాగమతి` తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న అనుష్క తాజాగా చేసిన చిత్రం `నిశ్శబ్దం`. హేమంత్ మధుకర్ రూపొందించిన ఈ చిత్రం ఏప్రిల్ రెండున విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలకు అనుష్క ప్రస్తుతం హాజరవుతోంది. సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఓ ప్రోగ్రామ్‌కు తాజాగా అనుష్క వెళ్లింది. 


ఆ కార్యక్రమంలో భాగంగా ప్రభాస్ ఫోటోను సుమ చూపించింది. ఆ ఫొటోను చూసిన వెంటనే అనుష్క.. అతను నా కొడుకు అని సమాధానం చెప్పింది. దీంతో సుమ షాకైంది. సరే.. కొడుకు కాదు.. అమరేంద్ర బాహుబలి గురించి చెప్పమని సుమ అడిగింది. అందుకే కదా ఈయన నాకు కొడుకు అయ్యాడంటూ అనుష్క మరో పంచ్ వేసింది. ప్రభాస్‌తో రిలేషన్ గురించి అనుష్క చెప్పిన సమాధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

Updated Date - 2020-03-19T18:26:13+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!