సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

బ్రేకింగ్: అమితాబ్ బచ్చన్‌కు కరోనా పాజిటివ్.. హాస్పిటల్‌లో చేరిక

ABN, First Publish Date - 2020-07-12T04:58:08+05:30

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌ కరోనా బారిన పడ్డారు. దీంతో.. ఆయన ముంబైలోని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌ కరోనా బారిన పడ్డారు. దీంతో.. ఆయన ముంబైలోని నానావతి ఆసుపత్రిలో శనివారం సాయంత్రం చికిత్స నిమిత్తం చేరారు. ఈ విషయాన్ని బిగ్‌బీనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని, ఆసుపత్రికి వెళ్లామని.. కుటుంబ సభ్యులు, సిబ్బంది కూడా కరోనా పరీక్షలు చేయించుకున్నారని.. రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్నట్లు అమితాబ్ ట్వీట్ చేశారు.


గత 10 రోజులుగా తనను కలిసిన వారంతా కరోనా టెస్టులు చేయించుకోవాలని ఆయన సూచించారు. అమితాబ్ వయసు ప్రస్తుతం 77 సంవత్సరాలు. బాలీవుడ్‌లో సింగర్ కనికా కపూర్ తర్వాత మళ్లీ ప్రముఖులెవరూ కరోనా బారిన పడలేదు. అమితాబ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆయన అభిమానుల్లో ఆందోళన నెలకొంది.



Updated Date - 2020-07-12T04:58:08+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!