యూనిట్ నన్ను పట్టించుకోలేదు... దురదృష్టం: నటి శివపార్వతి
ABN, First Publish Date - 2020-08-19T15:39:01+05:30
‘వదినమ్మ’ సీరియల్లో కీలక పాత్రలో నటిస్తున్న నటి శివపార్వతి కరోనా వైరస్ కారణంగా హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. పరిస్థితి క్రిటికల్ అయ్యింది. చివరకు డాక్టర్స్ సహాయంతో ఆమె బ్రతికారు. తనకు కరోనా వైరస్ సోకడం, తాను ఎదుర్కొన్న మానసిక పరిస్థితి ఇబ్బందులు గురించి శివ పార్వతి ఫేస్ బుక్‌లో ఓ వీడియో పోస్ట్ చేశారు.
‘వదినమ్మ’ సీరియల్లో కీలక పాత్రలో నటిస్తున్న నటి శివపార్వతి కరోనా వైరస్ కారణంగా హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. పరిస్థితి క్రిటికల్ అయ్యింది. చివరకు డాక్టర్స్ సహాయంతో ఆమె బ్రతికారు. తనకు కరోనా వైరస్ సోకడం, తాను ఎదుర్కొన్న మానసిక పరిస్థితి ఇబ్బందులు గురించి శివ పార్వతి ఫేస్ బుక్‌లో ఓ వీడియో పోస్ట్ చేశారు. ‘‘ప్రభాకర్‌గారు ప్రొడ్యూస్ చేస్తూ యాక్ట్ చేస్తున్న సీరియల్ వదినమ్మలో నేను ఓ పాత్రను పోషిస్తున్నాను. నాకు కరోనా పాజిటివ్ వచ్చి.. మళ్లీ ఇంటికి వస్తానో లేదో అనే పరిస్థితిలోకి వెళ్లిపోయి, పదిరోజుల తర్వాత నిన్నరాత్రే ఇంటికి చేరుకున్నాను. రెండు హాస్పిటల్స్ మారాను. ఈ విషయం ప్రభాకర్‌గారికి, యూనిట్ సభ్యులకు కూడా తెలుసు. ఈ విషయంలో నేను ఎవరికీ ఏమీ అనదలుచుకోలేదు. థాంక్స్ మాత్రమే చెప్పాలనుకుంటున్నాను.
ఎంత పెద్ద ఆర్టిస్ట్, చిన్న ఆర్టిస్ట్ అయినా ఆపద ఒకటే, ప్రాణం ఒకటే. ఆర్టిస్టులుగా మనం కలిసి పనిచేస్తున్నప్పుడు అనుబంధం ఉండాలి. కానీ.. నా గురించి ఎవరూ పట్టించుకోలేదు. ఇది దురదృష్టం. ఎవరి సమస్య వారిది. ఎవరికీ ఎవరూ తోడుండరు. ప్రభాకర్‌గారి నుండి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. మనుషుల మధ్య సంబంధాలు కృతకంగా అయిపోయాయి. నేను ఐదేళ్ల నుండి సినిమాలు చేయకపోయినా జీవిత రాజశేఖర్‌గారు హాస్పిటల్‌కు వచ్చారు. నా పరిస్థితి తెలుసుకుని అక్కడ డాక్టర్స్‌తో మాట్లాడారు. చాలా విషయాల్లో సపోర్ట్ చేసి నన్ను బయటకు తీసుకువచ్చారు. రెండు లక్షలు ఏం సరిపోతుందండి.. పది లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చేసుకోమని ప్రభాకర్‌గారు చెప్పారు. నేను చేసుకోలేకపోయాను. ప్రొడక్షన్ నుండి ఇన్సూరెన్స్ ఏదో చేశామని అన్నారు. కానీ అదేమైనా నాకు పనికొస్తుందా? క్లెయిమ్ చేసుకోండి అని ఎవరూ చెప్పలేదు. ఈ విషయంలో నేను అందరికీ థాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. నేను పోయానని తెలిసినా రెస్పాన్స్ ఇలాగే ఉంటుంది. ఈ సీరియల్‌కు నిర్మాతగా వ్యవహరిస్తున్న శివకుమార్‌గారు ఖమ్మంలో మాకు సన్మానం చేశారు. ఆ అభిమానంలో కనీసం అవగింజంత కూడా ఆర్టిస్ట్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు లేదు. అభిమానాన్ని పాటించిన రోజే ఆర్టిస్ట్ అనేవాడికి అర్హత ఉంటుంది. అంతే కానీ.. మేకప్ వేసుకుని నటించేస్తే కరెక్ట్ కాదు’’ అన్నారు శివపార్వతి.
’’