సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

బర్త్‌డే స్పెషల్‌: ఆది సాయికుమార్ ‘బ్లాక్’ ఫస్ట్ లుక్

ABN, First Publish Date - 2020-12-24T01:35:54+05:30

ఆది సాయికుమార్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తోన్న సినిమాలలోని ఫస్ట్ లుక్స్‌, టీజర్స్‌ని చిత్రయూనిట్స్‌ ప్లాన్‌ చేశాయి. ఆయన నటిస్తోన్న 'శశి' చిత్ర టీజర్‌ను మెగాస్టార్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆది సాయికుమార్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తోన్న సినిమాలలోని ఫస్ట్ లుక్స్‌, టీజర్స్‌ని చిత్రయూనిట్స్‌ ప్లాన్‌ చేశాయి. ఆయన నటిస్తోన్న 'శశి' చిత్ర టీజర్‌ను మెగాస్టార్‌ చిరంజీవి విడుదల చేసిన విషయం తెలిసిందే. అలాగే ఆయన హీరోగా మహాంకాళి మూవీస్ బ్యానర్‌పై మహాంకాళి దివాకర్ నిర్మిస్తున్న 'బ్లాక్' చిత్ర ఫస్ట్ లుక్‌ను కూడా చిత్రయూనిట్‌ విడుదల చేసింది. కొత్త దర్శకుడు జిబి కృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. డిసెంబర్ 23న ఆది పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల చేసారు దర్శక నిర్మాతలు. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆదికి జోడీగా దర్శన బానిక్ నటిస్తున్నారు. 


ఈ సందర్భంగా.. ఆది కెరీర్లో ఈ చిత్రం ఒక మైలురాయిగా నిలుస్తుంది. ఈ చిత్ర షూటింగ్ పూర్తయింది. శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుగుతున్నాయి. ఖచ్చితంగా హిట్టు కొడతాము. చిత్ర రిలీజ్ వివరాలు త్వరలోనే ప్రకటిస్తాం.. అని తెలిపారు మేకర్స్‌. ఈ సినిమాలో కౌశల్ మందా, ఆమని, ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అమర్ రెడ్డి ఈ చిత్రానికి ఎడిటర్‌గా పని చేస్తుండగా.. సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు.

Updated Date - 2020-12-24T01:35:54+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!