సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

4 మిలియన్‌ క్లబ్‌లో స్వీటీ

ABN, First Publish Date - 2020-10-14T02:22:42+05:30

స్వీటీ అనుష్క ఈ మధ్య సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్న విషయం తెలిసిందే. తను నటించిన నిశ్భబ్దం చిత్ర ప్రమోషన్‌లో భాగంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

స్వీటీ అనుష్క ఈ మధ్య సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్న విషయం తెలిసిందే. తను నటించిన నిశ్భబ్దం చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ట్విట్టర్‌ ఎంట్రీ కూడా ఇచ్చిన అనుష్క.. ఆ తర్వాత నుంచి రెగ్యులర్‌గా ఏదో ఒక పోస్ట్ చేస్తూనే ఉంది. దీంతో ఆమెను ఫాలో అయ్యేవారి సంఖ్య కూడా పెరుగుతుంది. తాజాగా ఆమెను ఫాలో అయ్యే వారి సంఖ్య 4 మిలియన్లకు చేరింది. సోషల్‌ మీడియాకు చెందిన ఇన్‌స్టాగ్రమ్‌లో తన ఫాలోవర్స్‌ 4 మిలియన్లకు చేరిందని తెలుపుతూ.. అనుష్క ఓ పోస్ట్ చేసింది.


'అందరికీ ధన్యవాదాలు..' అని తెలిపిన అనుష్క.. తన ఫొటోలతో నింపిన 4 మిలియన్ల పోస్టర్‌ను షేర్‌ చేసింది. ఈ పోస్టర్‌ మీద 'ధన్యవాదాలు.. ఎప్పుడూ నవ్వుతూ ఉండండి.. ప్రేమతో మీ అనుష్క' అని ఆమె సంతకం చేసి ఉంది. అనుష్క 4 మిలియన్ల క్లబ్‌లో చేరిన సందర్భంగా ఆమె అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తూ.. శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 



Updated Date - 2020-10-14T02:22:42+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!