Arun Vijay: అరుణ్‌ విజయ్‌ కొత్త చిత్రానికి టైటిల్ ఫిక్స్.. ఏంటంటే?

ABN , Publish Date - Apr 26 , 2024 | 12:31 AM

అరుణ్‌ విజయ్‌ వరుస చిత్రాలను అంగీకరిస్తున్నారు. ప్రస్తుతం బాలా దర్శకత్వంలో ‘వణంగాన్‌’ చిత్రంలో నటించిన ఆయన.. తాజాగా మరో కొత్త చిత్రం చేసేందుకు అంగీకరించారు. ఈ చిత్రానికి ‘రెట్ట తల’ అనే పేరు ఖరారు చేశారు. ఇందులో అరుణ్‌ విజయ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇది అరుణ్‌ విజయ్‌ 36వ చిత్రం.

Arun Vijay: అరుణ్‌ విజయ్‌ కొత్త చిత్రానికి టైటిల్ ఫిక్స్.. ఏంటంటే?
Arun Vijay Retta Thala First Look

అరుణ్‌ విజయ్‌ (Arun Vijay) వరుస చిత్రాలను అంగీకరిస్తున్నారు. ప్రస్తుతం బాలా దర్శకత్వంలో ‘వణంగాన్‌’ చిత్రంలో నటించిన ఆయన.. తాజాగా మరో కొత్త చిత్రం చేసేందుకు అంగీకరించారు. ఈ చిత్రానికి ‘రెట్ట తల’ (Retta Thala) అనే పేరు ఖరారు చేశారు. ఇందులో అరుణ్‌ విజయ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. దీనికి సంబంధించిన టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌ కార్యక్రమం తాజాగా చెన్నై నగరంలో జరిగింది. ఇందులో చిత్ర బృందంతో పాటు పలువురు సినీ ప్రముఖులు, చిత్ర బృందం సభ్యులు పాల్గొన్నారు.


Retta-Thala.jpg

ఇది అరుణ్‌ విజయ్‌ 36వ చిత్రం. బాబీ బాలచంద్రన్‌ (Bobby Balachandran) సమర్పణలో బీటీజీ యూనివర్శల్‌ ఫిలిమ్స్‌ భారీ బడ్జెట్‌తో తెరకెక్కించనుంది. క్రిస్‌ తిరుకుమరన్‌ (Kris Thirukumaran) దర్శకుడు. తాన్య రవిచంద్రన్‌ (Tanya Ravichandran), సిద్ధి ఇద్నానీ (Siddhi Idnani) హరోయిన్లు. శ్యామ్‌ సీఎస్‌ సంగీతం. ‘రెట్ట తల’ అనే టైటిల్‌ ఖరారు చేసిన అనంతరం ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌‌ (Retta Thala First Look)ని మేకర్స్ రిలీజ్‌ చేశారు. ఇందులో అరుణ్‌ విజయ్‌లు ఆక్రోశంగా తలపడుతున్నారు. ఈ పోస్టర్ సినిమాపై ఇంట్రస్ట్‌ని కలిగిస్తోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Updated Date - Apr 26 , 2024 | 12:31 AM