Arun Vijay: నా ప్రతి సినిమాకు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది..

ABN , Publish Date - Jan 19 , 2024 | 12:49 PM

మంచి కథలకు ప్రేక్షకుల నుంచే కాకుండా మీడియా నుంచి ఆదరణ లభిస్తుందని, అలాంటి ఆదరణ తాను నటించిన ‘మిషన్‌ చాప్టర్‌-1’కు లభించిందని హీరో అరుణ్‌ విజయ్‌ అన్నారు. లైకా ప్రొడక్షన్స్‌ నిర్మాణంలో ఏఎల్‌. విజయ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 12న సంక్రాంతి సందర్భంగా విడుదలై పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ చెన్నైలో థ్యాంక్స్ మీట్‌ని ఏర్పాటు చేశారు.

Arun Vijay: నా ప్రతి సినిమాకు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది..
Hero Arun Vijay

మంచి కథలకు ప్రేక్షకుల నుంచే కాకుండా మీడియా నుంచి ఆదరణ లభిస్తుందని, అలాంటి ఆదరణ తాను నటించిన ‘మిషన్‌ చాప్టర్‌-1’కు లభించిందని హీరో అరుణ్‌ విజయ్‌ (Arun Vijay) అన్నారు. లైకా ప్రొడక్షన్స్‌ (Lyca Productions) నిర్మాణంలో ఏఎల్‌. విజయ్‌ (AL Vijay) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 12న సంక్రాంతి సందర్భంగా విడుదలై పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ థ్యాంక్స్ గివింగ్ మీట్‌ని ఏర్పాటు చేశారు.

ఈ థ్యాంక్స్‌ గివింగ్‌ మీట్‌లో హీరో అరుణ్‌ విజయ్‌ మాట్లాడుతూ.. తాను నటించే ప్రతి సినిమాకు ఏదో ఒక సమస్య ఉత్పన్నమవుతూనే ఉందని, సాంకేతికపరంగానే కాకుండా, శారీరకంగా కూడా సమస్యలు ఎదురయ్యాయన్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు వస్తున్న పాజిటివ్‌ టాక్‌ ఆ కష్టాలు మరిచిపోయేలా చేసింది. చెన్నైలోనే కాదు, మదురై, పుదుచ్చేరి ఇలా ప్రతి చోటా ప్రేక్షకులు తమ కుటుంబాలతో వచ్చి చూస్తున్నారు. రోజురోజుకూ స్ర్కీన్‌ల సంఖ్య పెరుగుతున్నాయని చెబుతూ.. తనపై నమ్మకంతో రూ.25 కోట్లు ఖర్చుపెట్టిన నిర్మాతలకు ఆయన కృతజ్ఞ్ఞతలు తెలిపారు. (Mission Chapter 1 Movie Thanks Meet)


Arun-Vijay.jpg

దర్శకుడు ఏఎల్‌ విజయ్‌ మాట్లాడుతూ.. మా అందరికీ శుభ సంవత్సరం. సంక్రాంతికి విడుదలై సక్సెస్‌ సాధించిన చిత్రాల్లో మా సినిమా ఒకటి. చాలా సంతోషంగా ఉంది. భారీ బడ్జెట్‌ మూవీకి అన్ని విధాలుగా అండగా ఉన్న నిర్మాతలకు ధన్యవాదాలు. సినిమాకు ప్రధానం కథ. మంచి కంటెంట్‌ ఉన్న చిత్రాలు ఎన్నడూ నిరాశపరిచింది లేదు. జీవీ ప్రకాష్‌ కుమార్‌ సంగీతం ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్ళిందని అన్నారు. ఇంకా ఇతర యూనిట్‌ సభ్యులు కూడా మాట్లాడారు. అరుణ్‌ విజయ్‌ సరసన ఇందులో అమీ జాక్సన్‌, నిమిషా సజయన్‌ హీరోయిన్లుగా నటించారు.


ఇవి కూడా చదవండి:

====================

*Nayanthara: జై శ్రీరామ్ అంటూ.. క్షమాపణలు చెప్పిన నయనతార

****************************

*Krishnam Raju: రెబల్ స్టార్ కృష్ణంరాజు జయంతికి మొగల్తూరులో ఏం చేస్తున్నారంటే..

****************************

*Guntur Kaaram: ‘కుర్చీ మడతపెట్టి’ పాట.. నిజంగానే మడతపెట్టేస్తోంది

*****************************

Updated Date - Jan 19 , 2024 | 12:49 PM