Chandini Chowdary: మరో బలమైన పాత్రలో చాందిని చౌదరి

ABN , Publish Date - Apr 26 , 2024 | 06:50 PM

పరభాషా నటీమణుల ప్రాబల్యం వున్న తెలుగు పరిశ్రమలో తెలుగమ్మాయిలకి మంచి పాత్రలు దొరకటం కష్టమే. కానీ అటువంటి పోటీని ఎదుర్కొంటూ తనదైన శైలిలో బలమైన పాత్రలు చేసుకుంటూ వెళుతున్న నటి చాందిని చౌదరి. ఇప్పుడు ఒక బలమైన పోలీసాఫీసర్ పాత్రలో కనిపించనున్న చాందిని

Chandini Chowdary: మరో బలమైన పాత్రలో చాందిని చౌదరి
Chandini Chowdary as a powerful cop in Yevam

ప్రస్తుతం తెలుగు పరిశ్రమలో కథానాయికలను పరభాషల నుండి దిగుమతి చేసుకుంటున్నా, తెలుగమ్మాయలకి కూడా మంచి అవకాశాలు వస్తున్నాయి. అలాంటి అవకాశాలను అందిపుచ్చుకున్నవారిలో చాందిని చౌదరి ఒకరు. తన ప్రతిభతో, మంచి నటన కనబరుస్తూ, బలమైన పాత్రల్లో కనిపిస్తూ ప్రేక్షకుల ఆదరణ పొందుతున్న నటి చాందిని చౌదరి. 'కలర్ ఫోటో' లో దీప్తి పాత్ర, తరువాత వరసగా 'సూపర్ ఓవర్', 'సమ్మతమే' లాంటి సినిమాలు చేసి, తాజాగా విడుదలైన 'గామి' సినిమా వరకు మంచి పాత్రలు పోషించి శెభాష్ అనిపించుకున్న నటి చాందిని. (Chandini Chowdary gets another powerful role in Yevam)

chandinichowdarycop.jpg

ఇప్పుడు ఇంకో బలమైన పాత్రలో కనిపించబోతోంది చాందిని. ఈసారి ఒక బలమైన పోలీస్‌ఆఫీసర్‌గా 'యేవమ్‌' సినిమాలో చాందిని చేస్తోంది, ఆ సినిమా నుండి ఆమె లుక్ ని విడుదల చేశారు. ఈ సినిమాలో ఆమే ప్రధాన పాత్ర పోషిస్తోంది. వశిష్ట సింహా, జైభారత్‌, ఆషురెడ్డి మిగతా నటీనటులు. ప్రకాష్‌ దంతులూరి దర్శకుడు. నవదీప్‌, పవన్‌ గోపరాజు నిర్మాతలు. మహిళా సాధికారికతను చాటి చెప్పే విధంగా ఆమె పాత్ర చిత్రంలో కనిపించనుంది అని చిత్ర నిర్వాహకులు చెపుతున్నారు.

Chandini Chowdary Latest Photos

ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌లో కనిపించినట్లుగా చాందిని చౌదరి పాత్ర 'ఆడపిల్లని అయితే ఏంటంటా? ' అనే విధంగా, నేటి మహిళా సాధికారితను, ధైర్యాన్ని రిప్రంజెట్‌ చేసే విధంగా వుంటుంది అని చెపుతున్నారు దర్శకుడు. ఇందులో చాందిని నటన ఎంతో హైలైట్‌గా వుంటుందిఅని, కొత్త కంటెంట్‌తో పాటు డిఫరెంట్‌ నేరేషన్‌తో ఈ సినిమా వుంటుంది అని చెపుతున్నారు.

Updated Date - Apr 26 , 2024 | 06:50 PM