Yevam: ‘గామి’ తర్వాత చాందినీ చౌదరి చేసే సినిమా ఇదే..

ABN , Publish Date - Feb 27 , 2024 | 08:05 PM

‘కలర్ ఫొటో, ‘గామి’ చిత్రాల ఫేమ్ చాందినీ చౌదరి.. ‘కేజీఫ్, నారప్ప’ ఫేమ్ వశిష్ట, నూతన నటుడు భరత్ రాజ్, బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి ముఖ్యపాత్రలలో.. ప్రకాష్ దంతులూరి దర్శత్వంలో.. నవదీప్ - పవన్ గోపరాజు స్థాపించిన C-Space నిర్మాణంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘యేవమ్’. తాజాగా ఈ చిత్ర ప్రమోషన్స్‌ని మేకర్స్ మొదలెట్టారు.

Yevam: ‘గామి’ తర్వాత చాందినీ చౌదరి చేసే సినిమా ఇదే..
Yevam Movie Working Still

‘కలర్ ఫొటో, ‘గామి’ చిత్రాల ఫేమ్ చాందినీ చౌదరి (Chandini Chowdary).. ‘కేజీఫ్, నారప్ప’ ఫేమ్ వశిష్ట (Vasishta N Simha), నూతన నటుడు భరత్ రాజ్, బిగ్ బాస్ ఫేమ్ అషు రెడ్డి ముఖ్యపాత్రలలో.. ప్రకాష్ దంతులూరి (Prakash Dantuluri) దర్శత్వంలో.. నవదీప్ - పవన్ గోపరాజు స్థాపించిన C-Space నిర్మాణంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘యేవమ్’ (Yevam). తాజాగా ఈ చిత్ర ప్రమోషన్స్‌ని మేకర్స్ మొదలెట్టారు. ప్రసిద్ధ చిత్రకారుడు లక్ష్మణ్ ఏలై చేత ప్రత్యేకంగా చేయించిన టైటిల్ లోగోను (Yevam Title Logo) సినీ తారల ద్వారా కాకుండా తాజాగా చిత్రకారుడి చేతే ఆవిష్కరించడం మేకర్స్ చేసిన వినూత్న ప్రయత్నంగా ప్రశంసలు కురుస్తున్నాయి. ఇన్‌స్టా యూజర్స్ కూడా దీన్ని లైక్ చేసి షేర్ చేస్తూ సక్సెస్ చేస్తున్నారు.


Chowdary.jpg

ఈ చిత్రం ఒక సైకలాజికల్ థ్రిల్లర్ అని, చాందినీ నటన హైలెట్ అని చిత్రకారులు చెబుతున్నారు. ‘గామి’ (Gaami) తర్వాత చాందిని చౌదరి చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాతో ఆమెకు చాలా మంచి పేరు వస్తుందని దర్శకనిర్మాతలు చెబుతున్నారు. ఈ చిత్రానికి నీలేష్ మండాలపు మరియు కీర్తన శేష్ సంగీతం అందించగా.. సినిమాటోగ్రాఫర్‌గా విశ్వేశ్వర్ SV, ఎడిటర్‌గా సృజన అడుసుమిల్లి, ప్రొడక్షన్ డిజైనర్‌గా లక్ష్మణ్ ఏలే బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.

Updated Date - Feb 27 , 2024 | 08:05 PM