పాయల్ రాజ్‌పుత్ పేరు మారిపోతుందా..
‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో యూత్ గుండెల్లో సెగలురేపి, ‘మంగళవారం’ మూవీతో మనసు దోచుకున్న బ్యూటీ పాయల్ రాజ్‌పుత్.
ఈ సారి పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
6 భాషల్లో ‘వెంకటలచ్చిమి’గా ఎంట్రీ ఇవ్వబోతోంది. ట్రైబల్ గర్ల్ యాక్షన్ రివైంజ్ స్టోరీ ఇది.
రాజా, ఎన్ఎస్ చౌదరి నిర్మాతలుగా, డైరెక్టర్ ముని దర్శకత్వంలో పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న చిత్రం ‘వెంకటలచ్చిమి’.
ఈ మూవీ శుక్రవారం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.
ఈ మూవీ గురించి పాయల్ రాజ్ పుత్ మాట్లాడుతూ.. ‘మంగళవారం’ సినిమా తర్వాత ఎన్నో కథలు విన్నాను.
ఏదీ నచ్చలేదు.. నచ్చక అన్నీ రిజెక్ట్ చేశాను.
డైరెక్టర్ ముని గారు ‘వెంకటలచ్చిమి’ కథ చెప్పగానే చాలా నచ్చేసింది.
ఈ సినిమా తర్వాత నా పేరు ‘వెంకటలచ్చిమి’గా స్థిరపడిపోతుందేమో అన్నంతగా బలమైన సబ్జెక్టు ఇది.
నా కెరీర్‌కి నెక్ట్స్ లెవల్‌గా ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ న
ిలిచిపోతుందనే నమ్మకం ఉంది.
Related Web Stories
నా కుమారుడిని అన్యాయంగా ఇరికించారు
దిల్‌రాజు ఇంట్లో ముగిసిన ఐటీ సోదాలు...ఏం తెలిసిందంటే
క్రిస్టిల్ డిసౌజా గార్జియస్ లుక్స్..
సైలెంట్‌గా మాస్టర్ ప్లాన్ వేస్తున్నసంయుక్త మీనన్..