స్పిరిట్‌ సినిమాలో ప్రభాస్ వైఫ్‌గా  ఎవరంటే..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ స్పిరిట్‌ సినిమాలో హీరోయిన్ దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది..

 పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. 

మారుతి దర్శకత్వంలో 'రాజాసాబ్‌', హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా సెట్స్‌పై ఉన్నాయి.

మరోపక్క 'కల్కి -2', 'సలార్‌-2 చిత్రాల పనులు జరుగుతున్నాయి.

  సందీప్‌రెడ్డి వంగాతో ప్రభాస్‌ చేసే స్పిరిట్‌ చిత్రం కూడా త్వరలో సెట్స్‌ మీదకెళ్లనుందని ఇటీవల దర్శకుడు ఓ వేదికపై చెప్పారు

ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారని సర్వత్రా ఆసక్తి నెలకొంది 

 ఈ నేపథ్యంలోనే టాలీవుడ్, బాలీవుడ్ లలో ట్రెండింగ్ లో ఉన్న ఓ బ్యూటీ లక్కీ ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది.

తాజా సమాచారం ప్రకారం 'సీతారామం' సినిమాతో కెరీర్ పీక్ ని చూసిన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా పరిగణిస్తున్నారట

  ప్రభాస్ సరసన నటించేందుకు ఇద్దరి హీరోయిన్ల పేర్లు వినిపించాయి. కానీ.. ప్రభాస్ వైఫ్ రోల్ లో నటించేందుకు మృణాల్ కరెక్ట్ అని మేకర్స్ భావిస్తున్నారట. 

 ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ నెగిటివ్ షేడ్స్ లో కనిపిస్తారు అనే వార్తలను కరీనా కొట్టిపడేసిన విషయం తెలిసిందే.