త్రిష మాటల్లో మర్మమేంటి?
హీరోయిన్ త్రిష తాజాగా చేసిన వ్యాఖ్యలపై ఇపుడు కోలీవుడ్‌లో చర్చనీయాంశమైంది.
ఎవరిని ఉద్దేశించి ఆమె అలా వ్యాఖ్యానించారు? ఆమె మాటల్లో మర్మమేంటి?
అనే సందేహాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు.
తమిళంలో ‘థగ్‌లైఫ్’, ‘విడాముయర్చి’, ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రాలతో పాటు
తెలుగు, మలయాళ భాషా చిత్రాల్లో నటిస్తూ ఎంతో బిజీగా ఉంది త్రిష.
ఈ నేపథ్యంలో ఆమె తన ఇన్‌స్టాలో ఓ పోస్ట్ చేశారు.
‘మన మనసులను గాయపరిచిన వ్యక్తులకు సన్నిహితంగా
మెలిగే వ్యక్తులతో కూడా మనం దూరంగా ఉండాలి’ అని కోరారు.
ఇది చూసిన సినీ ప్రముఖులు.. ఎవరిని ఉద్దేశించి త్రిష
ఈ తరహా వ్యాఖ్యలు చేసివుంటారని ఒకరినొకరు ప్రశ్నించుకుంటున్నారు.
ప్రస్తుతం త్రిష తెలుగులో ‘విశ్వంభర’ చిత్రంలో చిరంజీవి సరసన నటిస్తున్నారు.
Related Web Stories
ఈ 'అబ్దుల్లా దీవానా' వెరీ స్పెషల్.. ఫరియా అబ్దుల్లా
అది తట్టుకోలేక థెరపీ కూడా తీసుకున్నా: అనన్యా పాండే
‘మళ్లీ పెళ్లి’.. సిద్ధార్ద్, అదితి రావ్ హైదరి ఫొటోలు వైరల్
బాగా మసాజ్ చేస్తే చాలు..: సారా అలీఖాన్