ఘనంగా వెంకీ రెండో కుమార్తె వివాహం

విక్టరీ వెంకటేశ్ ఇంట పెళ్లి బజాలు మోగాయి

వెంకటేష్‌కి ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు

వెంకీ రెండో కుమార్తె హవ్యవాహిని వివాహం డాక్టర్ నిషాంత్‌‏తో శుక్రవారం రాత్రి జరిగింది

నార్సింగిలోని ది అడ్రస్‌ కన్వెన్షన్ సెంటర్‌ ఈ వేడుకకు వేదికైంది

ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో చాలా సింపుల్‌గా ఈ వివాహం జరిగింది

స్టార్ హీరో కుమార్తె వివాహం ఇంత సింపుల్‌గా జరగడంతో.. అంతా వెంకీపై ప్రశంసలు కురిపిస్తున్నారు

పెళ్లికి ముందు జరిగిన మెహందీ వేడుకలో మహేష్ సతీమణి నమ్రత, కూతురు సితార సందడి చేశారు

హవ్యవాహిని, డాక్టర్ నిషాంత్‌ దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రస్తుతం ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి