హాట్‌ బ్యూటీ అప్సరా రాణి గురించి ఈ విషయాలు తెలుసా?

యువత హృదయాల్ని హీటెక్కించే ఫొటో షూట్‌లతో పాపులర్‌ అయింది.

అప్సరా రాణి డెహ్రాడూన్ లో పుట్టింది. ఆమె అసలు పేరు అంకితా మహారాణా.

బెల్గాంలోని జీఐటీ కాలేజ్‌ బీకెట్‌ పూర్తి చేసింది. చిన్నప్పటి నుంచే నటన మీద ఆసక్తి ఉండటంతో   హీరోయిన్  కావాలని అప్పుడే డిసైడ్‌ అయిందట.

'4 లెటర్స్‌' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. 'ఊల్లాల ఊల్లాల', 'థ్రిల్లర్‌' చిత్రాల్లో హీరోయిన్  గా నటించింది. ఏదీ గుర్తింపు తీసుకురాలేదు.

లాక్‌డౌన్లో  ఆర్‌జీవీ దర్శకత్వంలో చేసిన 'థ్రిల్లర్', 'డేంజరస్‌' చిత్రంతో ఎక్కడలేని పాపులారిటీ  తెచ్చుకుంది.

'క్రాక్‌'లో భూమ్‌ బద్దల్‌, 'సీటీమార్‌'లో పెప్సీ ఆంటీ పాటలతో హాట్‌హాట్‌ అందాలతో మెప్పించింది.' ఐటెమ్‌ సాంగ్స్‌ వల్లే ఆమెకు గుర్తింపు లభించింది.

2023లో సుధీర్‌బాబు హీరోగా వచ్చిన 'హంట్‌' చిత్రంతో 'పాప పైలం' పాటతో మెప్పించింది.

అప్సరాకు దర్శకత్వం చేసే ఆలోచన ఉంది. టైమ్‌ చూసి డైరెక్షన చేస్తానంటోంది

టాలీవుడ్‌లో తన ఫేవరెట్‌ హీరో నాగార్జున అని పలు సందర్భాల్లో చెప్పింది.

గ్లామర్ పాత్రలే లేకుండా మహిళా ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేయాలనుందనే కోరికను బయట పెట్టింది.