యాంకర్‌గా టాలీవుడ్‌కి సుపరిచితురాలు

బుల్లితెరపై ఆమె కనిపిస్తే చాలు వీక్షకులకు ఎనలేని ఎనర్జీ వస్తుంది.

ఒక్కోసారి హాట్‌హాట్‌ దుస్తుల్లో  కుర్రకారు మతి పోగొడుతుంటుంది.

అందంతోపాటు చలాకీతనంతో ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది.

టీవీ యాంకర్‌గా కొనసాగుతూనే సినిమాల్లోనూ మెరుస్తుంటుంది.

అభిమానులు ఆమెను ముద్దుగా రాములమ్మా అని పిలుచుకుంటారు

'జులాయి’ సినిమాతో వెండితెరకు పరిచయమైంది. అందులో బన్నీకి చెల్లిగా నటించింది.

తర్వాత పలు చిత్రాల్లో కూడా మెరిసి మెప్పించింది. కథల ఎంపికలో ఆచితూచి అడుగేస్తుంది.

'బిగ్‌బాస్‌ 3' కంటెస్టెంట్‌గా ప్రేక్షకులకు మరింత చేరువైంది. ప్రస్తుతం శ్రీముఖి గురించి ఓ వార్త హల్‌చల్‌ చేస్తోంది.

పాన్ ఇండియా హీరో సినిమాలో అవకాశం అందుకుందని టాక్‌.

అల్లు అర్జున్‌- అట్లీ కాంబోలో రానున్న చిత్రంలో శ్రీముఖి బన్నికి చెల్లెలి పాత్రలో కనిపించనుంది.

అల్లు అర్జున్‌- అట్లీ కాంబోలో రానున్న చిత్రంలో శ్రీముఖి బన్నికి చెల్లెలి పాత్రలో కనిపించనుంది.