అంజలి తెలుగమ్మాయి, రాజోలులో పుట్టింది, కానీ తమిళంలో ఎక్కువ సినిమాలు చేసింది
అంజలి మొదటి సినిమా తెలుగులో 'ఫోటో' దర్శకుడు శివనాగేశ్వర రావు, 2006లో విడుదల
2007లో తమిళంలో ఆరంగేట్రం 'కత్తరదు తమిళ్' సినిమాతో. బెస్ట్ డెబ్యూ నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు
చాలా తమిళ సినిమాలు చేసాక 2013 లో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' తో మళ్ళీ తెలుగులో అంజలి
సీత పాత్రలో అంజలి తప్ప మరెవరినీ ఊహించలేము, అందుకే ఆమె స్పెషల్ జ్యూరీ నంది అవార్డుతో పాటు, ఫిల్మ్ ఫేర్ ఉత్తమ సహాయనటి, సైమాలో కూడా ఉత్తమ సహాయ నటి అవార్డులను దక్కించుకుంది.
ఆ తరువాత 2014లో వచ్చిన 'గీతాంజలి' తెలుగు సినిమాలో ఆమె పాత్రకి గాను ఉత్తమనటి నంది అవార్డును గెలుచుకుంది
వెబ్ సిరీస్ లలో కూడా తన ప్రతిభ చూపిన అంజలి, ఇప్పుడు వరసగా తెలుగు, తమిళం సినిమాలతో చాలా బిజీగా వున్న నటీమణుల్లో ఒకరు.
రామ్ చరణ్ తో నటిస్తున్న 'గేమ్ చెంజర్', 'గ్యాంగ్స్ అఫ్ గోదావరి', 'గీతాంజలి 2' ఇంకా చాలా తెలుగు సినిమాలు విడుదలకి సిద్ధంగా వున్నాయి
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో తన ప్రతిభ చూపిస్తూ ఎన్నో అవార్డులు గెలుచుకున్న అంజలి